పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఓసీ, బీసీలకు ప్రస్తుతం 30 శాతం అర్హత మార్కులు ఉండగా దీన్ని 25 శాతానికి తగ్గించింది.
ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. ఎంసెట్, ఈసెట్‌లలో 25 శాతమే అర్హత మార్కులు ఉండటంతో పాలిసెట్‌లోనూ ఈ మార్పు తీసుకొచ్చింది
పాలిసెట్ ఫలితాలు*
ఏపీ పాలీసెట్ 2020: ఫలితాలు విడుదల
పాలీసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 71631 మంది విద్యార్థులు హాజరుకాగా.. 60,780 మంది ఉత్తీర్ణులయ్యారు. మట్టా దుర్గా సాయి కీర్తి తేజ (మొదటి ర్యాంక్) సాధించగా.. సుంకర అక్షయ్ ప్రణీత్ (తూర్పు గోదావరి) రెండో ర్యాంక్.. శ్రీ దత్త శ్యామ్ సుందర్ (తూర్పు గోదావరి) మూడో ర్యాంక్ సాధించారు.
ఆంధ్రప్రదేశ్ పాలీసెట్-2020 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్ పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు.
పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్- 2020 ఫలితాలను శుక్రవారం విడుదలైనవి.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, టెక్నికల్ ఎడ్యు కేషన్ కమిషనర్ ఎంఎం నాయక్ ఈ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు విడుదలైనవి.