విద్యావారధి:: ⚘⚘* సప్తగిరి ఛానెల్ లో 1 నుంచి 10 తరగతుల ప్రసార సమయాలు.
*దూరదర్శన్ సప్తగిరి వీడియో పాఠాలు*
*1,2 తరగతులకు*
*TIME : 11 AM -12 NOON*
*3,4,5 తరగతులకు*
*TIME : 12 NOON – 1 PM*
*6,7 తరగతులకు*
*TIME : 2 PM – 3 PM*
*8,9 తరగతులకు*
*TIME : 3 PM – 4 PM*
*10 వ తరగతి*
*Languages
*TIME : 10 AM – 11 AM*
*Non Languages
*TIME: 4 PM – 5 PM*
🔹 *సప్తగిరి చానల్ ద్వారా పిల్లలకు పాఠాలు*
🔹 *డిజిటల్ పరికరాలు ఉన్నవారికి ఆన్‌లైన్ వీడియోలతో బోధన*
*🔹సదుపాయాలు లేని వారికి మొబైల్ పాఠశాలల ఏర్పాటు*
కరోనాతో పాఠశాలలు తెరుచుకోలేని పరిస్థితుల్లో పిల్లలకు చదువులపై ఆసక్తి తగ్గకుండా ఉండేందుకు వారి వద్దకే బోధనా కార్యక్రమాలు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
ముఖ్యంగా రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 72 లక్షల మంది విద్యార్థుల్లో 56 శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు.
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చదువులు కొనసాగేలా డిజిటల్ బోధనను దేశంలోని ఏ రాష్ట్రమూ చేపట్టక ముందే దూరదర్శన్ (సప్తగిరి చానల్), ఆకాశవాణిల ద్వారా విద్యామృతం, విద్యాకలశం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ బోధన చేపట్టింది.
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సూచనలు పాటిస్తూ హైటెక్, నోటెక్, లోటెక్ అని విద్యార్థులను మూడు రకాలుగా వర్గీకరించి హైటెక్ వారికి ఆన్‌లైన్ పద్ధతిలో, లోటెక్ వారికి దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా, నోటెక్ వారికి మొబైల్‌వ్యానుల ద్వారా బోధన జరిగేలా చూస్తున్నారు.
► ఒకటి నుంచి పదో తరగతి వరకూ అభ్యాసం కోసం 63 కొత్త వర్క్‌బుక్‌లను రూపొందించి ఈ దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా బోధన కొనసాగిస్తున్నారు.
► వీడియోలు ముందుగానే రూపొందించి నిపుణులైన టీచర్లతో బోధన చేయించారు.
► కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉన్న వారికి అభ్యాస యాప్ ద్వారా కూడా బోధనా వీడియోలను అందుబాటులో ఉంచారు.
► మొబైల్ వాహనాల ద్వారా పిల్లలకు వారి గ్రామాల్లోనే ఆసక్తికరమైన రీతిలో పాఠ్యబోధనకు ఏర్పాట్లు చేశారు.
► విద్యార్థులు, టీచర్ల ఆంగ్ల భాషా పరిజ్ఞానం, నైపుణ్యం పెంపు కోసం వెబినార్ ద్వారా ఆన్‌లైన్ సదస్సులు నిర్వహించారు.