goveernment-guidelines-on-reopen-colleges-schools-for-teachers

goveernment-guidelines-on-reopen-colleges-schools-for-teachers

Septembr 21st నుంచి ఆన్లైన్ బడులు*

*తొమ్మిది నుంచి ఇంటర్ వరకే*

21 వ తేదీ నుండి పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు గురించి కమీషనర్   గారి వివరణ.*

 *నేడు పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు పై  కమీషనర్ గారిని వివరణ కోరగా  21వ తేదీన అన్ని యాజమాన్యాల అందరూ ఉపాధ్యాయులు (Primary, UP,HS ) హాజరు కావాలని తెలిపారు*

  *22వ తేదీ నుండి  50% ఉపాధ్యాయులు హాజరుకావాలి.*

     *ఏకోపాధ్యాయ  పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజు హాజరు కావాలని తెలియజేశారు*

   *ఈ విషయం పై అన్ని జిల్లాల DEO లకు  కొద్ది సేపటి క్రితం  కమీషనర్ గారు  సమాచారం అందించటం జరిగింది*

 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు హాజరు కావాలి.

 అదేవిధంగా 22వ తేదీ నుండి 50% మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలన్నారు.

*️కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బడులు తెరిచేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది.

తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

️కరోనాతో 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది. తొమ్మిది నుంచి ఇంటర్ వరకు స్కూల్స్, కాలేజీలు తెరిచేందుకు విద్యాశాఖ కార్యాచరణను సిద్ధం చేసుకుంది.

️అయితే, విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్లో బోధించాలని నిర్ణయించింది.

స్కూళ్లు తెరిచే రోజునే తల్లిదండ్రుల పర్యవేక్షక కమిటీలతో (పీఎంసీ) సమావేశం ఏర్పాటు చేసి కొవిడ్ నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 ️ఉపాధ్యాయులు 50 శాతం హాజరుకావాలని సూచించింది. ఆన్‌లైన్ బోధన, టెలీ కౌన్సెలింగ్, విద్యావారధి ఈ కార్యక్రమాల ద్వారా బోధిస్తున్న పాఠాలపై అనుమానాలు

ఉంటేనే విద్యార్థులు పాఠశాల లకు రావాల్సి ఉంటుంది. అది కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక సమ్మతి తీసుకోవాలని స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. 

️అన్ని స్కూళ్ల హెచ్ఎంలు, కాలేజీ ప్రిన్సిపాల్స్

ప్రాంగణాలను శుభ్రం చేయించి, “శానిటైజ్ చేయించాలని తెలిపింది. నోట్ బుక్, పెన్నులు, పెన్సిల్, ఎంజర్, వాటర్ బాటిల్ మొదలైన వస్తువులను విద్యార్థులు పంచుకోకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

️విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి గత విద్యాసంవత్సరంలో వారి అభ్యాసన ఫలితాలను అంచనా వేయడానికి పరీక్షలు నిర్వహించాలి.

 ️23న రెండో రౌండ్ ఉపాధ్యాయులు వారి సబ్జెక్ట్ కు అనుగుణంగా ఇదే పని చేపట్టాలి. పరీక్ష ఫలితాలను విశ్లేషించి పరిష్కార సాధన కోసం

విద్యార్థులకు మార్గదర్శకత్వం, సౌలభ్యాన్ని బట్టి రోజు వారీగా వర్క్ షీట్లు ఇవ్వాలి.

️విద్యార్థులు వర్క్ షీట్లను ఇంట్లో లేదా పాఠశాలలో ప్రాక్టీస్ చేయవచ్చు. అక్టోబరు ఐదో తేదీ వరకు విద్యాసంస్థలు ఇలానే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.

 ️ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇంటి నుంచే పాఠాలు బోధించాలి.

ఉన్నత విద్యా సంస్థలు, పాఠశాలల పునఃప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు

మార్గదర్శకాల్లో ప్రధానంగా విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించింది.

లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు వినే ఆప్షన్‌ ఇచ్చింది. 

ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని పేర్కొన్నది.

ఇష్టమైతేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే..*

*21 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం..*

*9 నుంచి 12 తరగతులకు బోధన..*

అక్టోబరు 5న స్కూళ్లు ప్రారంభించే ఆలోచన.

విద్యార్థి తల్లిదండ్రుల/సంరక్షకుని అంగీకార పత్రము డౌన్లోడ్-2

6th TO 9TH CLASS VARADHI WORK BOOKS ALL SUBJECTS AP SCERT

10th CLASS VARADHI WORK BOOKS ALL SUBJECTS AP SCERT

కోవిడ్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

అయితే ఉన్నతాధికారుల సూచనల మేరకు  అన్‌లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు.

 కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలు జారీ చేసింది.

తరగతులు ప్రారంభమయ్యే ఈ నెల 21వ తేదీ నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత పాటించేలా, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన అన్ని ప్రామాణిక నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ పాఠశాలలకు స్వచ్ఛందంగా వచ్చి ఉపాధ్యాయుల వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకున్న 9-12వ తరగతి విద్యార్థులకుగాను ప్రత్యేక సూచనలను విడుదల చేసింది.

ఈ నెల 21 నుంచి తల్లిదండ్రుల అనుమతితో ఆయా తరగతుల విద్యార్థులు పాఠశాలలకు రావడానికి కేంద్రం అనుమతించిన విషయం విదితమే.

తరగతి గదుల నిర్వహణ, రవాణా సదుపాయాలతో పాటు పాఠశాలల్లో పాటించాల్సిన అన్ని జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భౌతిక దూరం పాటించాలని తెలిపింది.

21  వ తేదీ నుంచి  స్వచ్ఛందంగా హాజరు అయ్యే 9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇవ్వాల్సిన అంగీకార పత్ర ము… నమూనా

విద్యార్థి తల్లిదండ్రుల/సంరక్షకుని అంగీకార పత్రము డౌన్లోడ్-1

SONU SOOD SCHOLARSHIPS DETAILS & ONLINE LINK

10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS DOWNLOAD

CENTRAL GOVERNMENT GUIDELINES FOR REOPEN SCHOOLS & COLLEGES DOWNLOAD

APPSC DEPARTMENTAL EXAMS RESULTS FROM 2008 TO 2019

పాఠశాలల పునఃప్రారంభానికి ముందస్తు ప్రణాళిక

SYకంటైన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న పాఠశాలల్ని తెరవొచ్చు.

కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలల్లోకి అనుమతి లేదు.

కంటైన్‌మెంట్‌ జోన్లలోకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వెళ్ల కూడదు.

* పాఠశాలల్లోని ప్రయోగశాలలు, ఎక్కువగా సంచరించే ప్రదేశాలను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేయాలి.

* క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగించిన పాఠశాలలను తప్పని సరిగా నిబంధనల ప్రకారం శానిటైజ్‌ చేయాలి.

* ఉపాధ్యాయులు, సిబ్బంది 50శాతం మంది హాజరయ్యేలా చూడాలి.

* 9-12 విద్యార్థులకు భౌతికంగా లేదా వర్చువల్‌ తరగతులకు హాజరయ్యే ఐచ్ఛికం ఇవ్వాలి. భౌతికంగా హాజరయ్యే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.

* బయో మెట్రిక్‌ హాజరు పద్దతి అవసరం లేదు.

* ఉపాధ్యాయులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

వీలుంటే ఆరు బయట కూర్చొనేలా చూడాలి.

* ప్రాంగణంలో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొనే ఏర్పాట్లు ఉండాలి.

* ‘క్యూ’ పద్ధతి పాటించే విషయంలో ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్‌ చేయాలి.

* సమావేశాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు సహా ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలు నిషేధం

* ప్రతి పాఠశాలలోనూ రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబరు, స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్‌ నంబర్లు ప్రదర్శించాలి.

* తరగతి గదుల్లో ఏసీ, వెంటిలేషన్‌ తదితర అంశాల్లో సంబంధిత మార్గదర్శకాలు అమలుచేయాలి.

* విద్యార్థులు లాకర్లు ఉపయోగించొచ్చు.

* స్విమ్మింగ్‌ పూల్‌ తప్పని సరిగా మూసివేయాలి.

*♦పాఠశాలలు తెరిచిన తర్వాత …*

* విద్యార్థుల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు వేర్వేరుగా ఉండాలి. వాటి వద్ద పరిశుభ్రత పాటించాలి. థర్మల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాలి.

* కరోనా లక్షణాలు లేనివారిని అనుమతించాలి.

* కరోనా జాగ్రత్తలకు సంబంధించి గోడపత్రికలు డిస్‌ప్లే చేయాలి.

* ఏ ప్రాంతంలోనూ ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలి.

* సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.

*♦తరగతి గదుల్లో…*

* విద్యార్థులు కూర్చొనే చోట ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలి.

* తరగతి జరుగుతున్నంత సేపు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కు ధరించే ఉండాలి.

* నోట్‌బుక్‌, పెన్నులు, పెన్సిళ్లు, మంచినీరు బాటిళ్లు తదితర వస్తువులు ఏవీ కూడా ఇతర విద్యార్థులతో పంచుకోకుండా చూడాలి.

*♦ప్రయోగశాలల్లో …*

* ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్‌ సమయంలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడాలి.

* ఉపయోగించే పరికరాలన్నిటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.

* పరికరాలు ఉపయోగించే ముందు తర్వాత చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి.

*♦గ్రంథాలయాల్లో…*

* ఆరు అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి

* మాస్కు తప్పనిసరిగా ధరించాలి

* కేఫ్‌టేరియా, మెస్‌ సౌకర్యాలు మూసివేయాలి.

DD SAPTHAGIRI VIDEIO LESSONS SCHEDULE & LIVE LESSONS

10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS DOWNLOAD

రవాణా, ఇతరత్రా సమయాల్లో…*

* బస్సులు, ఇతరత్రా రవాణా సాధనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయడంతోపాటు సామాజిక దూరం పాటించేలా చూడాలి.

* పాఠశాల ప్రాంగణం రోజూ శుభ్రం చేయాలి.

* కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లను శానిటైజ్‌ చేయాలి.

* మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలి.

* విద్యార్థులతో పరిశుభ్రత పనులు చేయించరాదు.

* విద్యార్థులకు కరోనా పట్ల అవగాహన కల్పించాలి.

* పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేట్‌ చేసి ప్రత్యేక గదిలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం ఇవ్వాలి.

*♦ఉన్నత విద్యా సంస్థల్లో పాటించాల్సిన జాగ్రత్తలు..*

* పరిశోధన, వృత్తిపరమైన కోర్సులు నిర్వహించే సంస్థల్లో ప్రయోగశాలలకు అనుమతులు కరోనా ప్రామాణిక నిర్వహణ నిబంధనలకు లోబడి ఉండాలి.

* నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో ఉపయోగించే పరికరాల మధ్య దూరం ఆరు అడుగులు ఉండాలి. స్థలం అందుబాటులో ఉంటే ఆయా పరికరాలను ఆరుబయట లేదా వరండాలలో అమర్చి భౌతిక దూరం పాటించేలా చూడాలి.

* ఆన్‌లైన్‌ తరగతులు, రెగ్యులర్‌ తరగతులు సమ్మిళితంగా కొనసాగాలి.

* రెగ్యలర్‌ తరగతి గదుల్లో విద్యార్థుల రద్దీని తగ్గించేందుకు, భౌతిక దూరం పాటించేందుకు వేర్వేరు టైమ్‌ స్లాట్‌ను అమలు చేయాలి.

* ఆరు అడుగుల దూరం పాటిస్తూ సిటింగ్‌ ఏర్పాట్లుండాలి.

* వసతి గృహాల్లోనూ పడకల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి.

* వైరస్‌ సోకిన విద్యార్థులకు వెంటనే ప్రత్యేక గదులు కేటాయించాలి. వైద్య సదుపాయం కల్పించాలి.

* ఆహారశాలల్లో రద్దీ నివారణకు భోజన సమయాలను వేర్వేరుగా కేటాయించాలి.

* చేతులు శానిటైజ్‌ చేసుకొనే వసతులు అందుబాటులో ఉండాలి.

VARADHI WORK SHEETS FOR 10TH CLASS AP SCERT DOWNLOAD PDF FILES

VARADHI WORK SHEETS FRO 6TH TO 9TH CLASS ALL SUBJECTS (T.M & E.M)

error: Content is protected !!