whatsapp-new-futures-delete-message-2019-dcember

whatsapp-new-futures-delete-message-2019-dcember

WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయిన కొత్త ఫీచర్… ఇలా వాడుకోండి

మీరు ప్రత్యేకంగా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసరం లేదు.

మీరు టైమ్ సెట్ చేస్తే చాలు.

సరిగ్గా ఆ సమయానికి మెసేజ్ డిలిట్ అవుతుంది.

వాట్సప్‌లో మీరు పంపిన మెసేజ్ డిలిట్ చేయాలంటే మీరు ఆ మెసేజ్‌ని సెలెక్ట్ చేసి డిలిట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు కదా?

ఇకపై ఈ అవసరం రాదు. మీరు పంపిన మెసేజ్ మీరు కోరుకున్న సమయంలో మాయమైపోతుంది. వాట్సప్‌లో వచ్చిన సరికొత్త ఫీచర్ ఇది.

మొదట్లో ‘డిసప్పీయరింగ్ మెసేజెస్’ పేరుతో ఈ ఫీచర్‌ని రూపొందించింది వాట్సప్.

ఆ తర్వాత పేరును ‘డిలిట్ మెసేజెస్’ అని మార్చింది. అంటే మెసేజ్‌ని డిలిట్ చేయడం అన్నమాట.

ప్రస్తుతం అయితే మీరు మెసేజ్ పంపిన తర్వాత కొంత సమయం వరకు డిలిట్ చేయొచ్చు.

అవతలివాళ్లు ఆ మెసేజ్ చదవకపోతే వారికి ఆ మెసేజ్‌లో ఏముందో తెలియదు.

కానీ కొత్త ఫీచర్ ఇంకా బాగా పనిచేస్తుంది.

మీరు పంపిన మెసేజ్‌ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు.

మీరు ప్రత్యేకంగా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసరం లేదు.

మీరు టైమ్ సెట్ చేస్తే చాలు.

సరిగ్గా ఆ సమయానికి మెసేజ్ డిలిట్ అవుతుంది.

ఉదాహరణకు మీరు 1 గంట, 1 రోజు, 1 వారం, 1 నెల, 1 ఏడాది ఇలా సమయాన్ని మీరే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

అంటే మీరు 1 గంట అని సెలెక్ట్ చేస్తే మీరు పంపిన మెసేజ్ సరిగ్గా 1 గంటలో డిలిట్ అవుతుంది.

అవతలివాళ్లు చదివినా సరే ఆ సమయానికి మెసేజ్ డిలిట్ అయిపోతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ అప్‌డేట్ బీటా యూజర్లకు లభిస్తోంది.

బీటా టెస్టింగ్ పూర్తైన తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

ఇక ఇటీవల గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్, కాల్ వెయిటింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లను అప్‌డేట్ చేస్తోంది వాట్సప్.

ఇక డార్క్ మోడ్ ఫీచర్ కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

WhatsApp Messenger DOWNLOAD HERE

WhatsApp Business DOWNLOAD HERE

error: Content is protected !!