academic-calender-year-Primary-U.P-Highschools-2019-20

academic-calender-year-Primary-U.P-Highschools-2019-20

పాఠశాల విద్యలో పాఠ్యాంశాల కుదింపు 

160 పని దినాలకు అనుగుణంగా తగ్గింపు 
ప్రతి నెలా మొదటి, మూడో శనివారాల్లో  బ్యాగ్‌ లేని రోజు 
విద్యా విషయక క్యాలెండర్‌ విడుదల.

సరైన ప్రమాణాలు సాధించడం లక్ష్యంగా పాఠశాల విద్యలో సిలబస్‌ను తగ్గించారు.

పాఠశాలల పని దినాలు 220 అయినప్పటికీ 160 పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను కుదించారు. ఈ విద్యా సంవత్సరంలో ఆనంద వేదిక, శనివారం సందడి కార్యక్రమాలతో పాటు సవరణాత్మక బోధన అమలు చేయనున్నారు.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ 2019-20 సంవత్సరానికి విద్యా విషయక క్యాలెండర్‌ విడుదల చేసింది.

విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి నెల మొదటి, మూడో శనివారాల్లో శనివారం సందడి పేరుతో బ్యాగ్‌ లేని రోజు (నో స్కూల్‌ బ్యాగ్‌ డే) నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు దుక్కిపాటి మధుసూదనరావు తెలిపారు. 

ఆ రెండు రోజులు విద్యార్థులకు కథలు, పాటలు, బొమ్మలు గీయటం, తయారు చేయడం, రంగులు వేయడం నేర్పిస్తారు.

అలానే తరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం సవరణాత్మక బోధనకు ఒక పీరియడ్‌ కేటాయించాల్సి ఉంటుంది.

ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: 

ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు కొనసాగుతాయి.

ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్‌ పాఠాలు) పాఠాలు బోధిస్తారు.

సెలవులు ఇలా.. 
మొత్తం పని దినాలు: 233 రోజులు 
దసరా సెలవులు:

 సెప్టెంబరు 28- అక్టోబరు 9 
మిషనరీ పాఠశాలల్లో క్రిస్మస్‌ సెలవులు:

 డిసెంబరు 24- జనవరి 1, 2020 
సంక్రాంతి సెలవులు: జనవరి 11- 20 
ఒంటిపూట బడులు: మార్చి 15-  ఏప్రిల్‌ 23 
వేసవి సెలవులు: ఏప్రిల్‌ 24- జూన్‌ 11

SUBJECT WISE WEIGHTAGE

ACADEMIC CALENDER FOR PIMARY SCHOOLS CLICK HERE

PROCEEDINGS OF CSE AMARAVATHI FOR ACADEMIC CALENDER CLICK HERE

ACADEMIC CALENDER FOR UP & HIGH SCHOOLS 2019-2020 YEAR CLICK HERE

TIME TABLE FOR UP AND HIGH SCHOOLS

error: Content is protected !!