Dr-YSR-Aarogyasri-Health-Care-Trust-EHS-edit-smart-health-cards

Dr-YSR-Aarogyasri-Health-Care-Trust-EHS-edit-smart-health-cards

Dr. YSR Aarogyasri Health Care Trust

(Govt. of Andhra Pradesh)

EHS ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకు గమనిక

 డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు QR కోడ్ తో కూడిన EHS స్మార్ట్ హెల్త్ కార్డ్ ని జారీ చేయడం జరుగుతున్నది. 

QR కోడ్ కలిగిన EHS స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ కొరకు మీ వివరాలను EHS పోర్టల్ లాగిన్ ద్వారా సరిచుసుకొని మార్పులు ఉన్నయెడల ఏడు రోజులలో అప్డేట్ చెయ్యండి.  

ఇందుకొరకు 

మీరు EHS పోర్టల్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లతో లాగిన్ అయ్యాక, డౌన్ లోడ్   హెల్త్ కార్డ్స్ మీద క్లిక్ చేసిన యెడల మీకు ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు మీ వివరాలను అప్డేట్ చేయగలరు.

  ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించి మీ లాగిన్ సరిచూసుకొని అందులో మీ పేరు, జెండర్, చిరునామా, ఫోటో, ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ సరిగా ఉన్నాయో లేదో గమనించి అక్కడ ఏదైనా తప్పులు ఉన్నచో సరిదిద్దుకోనుటకు ఏడు రోజులు గడువు ఇవ్వబడినది. 

మీరు అప్డేట్  చెయ్యని యెడల ఉద్యోగస్తుల మరియు పెన్షనర్ల దరఖాస్తులో ఉన్న వివరాలు సరైనవే అని భావించి స్మార్ట్ హెల్త్ కార్డులో ఆ వివరాలు ప్రింట్ చెయ్యడం జరుగుతుంది.

   ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఈ అవకాశాన్ని గమనించి మీ లాగిన్ ని సరిచేసుకొని డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కి సహకరించగలరు అని డాII ఏ. మల్లికార్జున, IAS, ముఖ్య కార్య నిర్వహణ అధికారి, డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్  వారు కోరడమైనది

ఏదైనా సందేహాల కొరకు టోల్ ఫ్రీ నెంబర్  104 కి మరియు 8333817469, 8333817406, 8333817414 లకు ఫోన్ చెయ్యగలరు, అలాగే [email protected]

[email protected].in కి మెయిల్ చెయ్యగలరు.                               

Chief Executive Officer

Dr. YSR Aarogyasri Health Care Trust

Guntur

EMPLOYEES HEALTH CARDS (EHS) OFFICIAL WEBSITE SIGN IN

HOW TO ENROLL EMPLOYEES DETAILS IN EHS CARDS

EHS COMPLETE INFORMATION

HOW TO EDIT, ADD & REMOVE EMPLOYEES BENIFICIERS IN EHS CARDS

ఉన్నత పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారులం దరికీ మనవి*

*త్వరలో మనకు QR code కలిగిన హెల్త్ కార్డులు ఇవ్వనున్నారు. వారం రోజుల లోపల వివరాలను సరిచేసుకోమని చెప్పారు. 

కనుక DDO  లాగిన్ లో ఉండాల్సిన ఉపాధ్యాయుల పేర్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాల్సి ఉంది కనుక ఉన్నత పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు/ మండల విద్యాశాఖాధికారులు  చేయవలసినవి.*

EHS  DDO లాగిన్ లో ఏయే ఉపాధ్యాయుల పేర్లు ఉన్నవో సరిచూసుకొనుటకు

1) http://www.ehs.ap.gov.in/EHSAP అనే సైట్ లోకి మీ DDO code తో లాగిన్ అవ్వండి

2) Registrations tab లో Enrollment Worklist Status లోకి వెళ్ళండి. అందులో మీకు రిజిస్టరై ఉన్న ఉపాధ్యాయుల పేర్లు కనపడతాయి.

3) అందులో మీ పాఠశాల/మండలం లో పనిచేస్తూ ఉండి కూడా పేర్లు లేకపోతే వారి వివరాలు పాత DDO లాగిన్ లో ఉంటాయి. ఉపాధ్యాయులు వారి వ్యక్తిగత లాగిన్ లో DDO address ను మార్చుకోమని చెప్పండి

*ఉపాధ్యాయులు వారి లాగిన్ లో DDO ను మార్చుకునే విధానం

1) మీ ట్రెజరీ ఐడీ తో లాగిన్ కండి

2) Initiate new/rejected beneficiaries అనే టాబ్ లోకి వెళ్ళండి

3) అక్కడ మీకు Note: please cross check the DDO details before submission ….. Please click here అనే టాబ్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయండి.

4) అందులో DDO వివరాలతో పాటు మీ వివరాలు కూడా తప్పుగా ఉంటే మార్చి సబ్‌మిట్ చేయండి

5) దీనితో మీ వివరాలు కొత్త DDO లాగిన్ లోకి వెళతాయి. DDO లాగిన్ లో యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఇంతటితో మీ వివరాలు కొత్త DDO లాగిన్ లోకి వెళతాయి.

*ప్రధానోపాధ్యాలు /మండల విద్యాశాఖాధికారులు వారి లాగిన్ లోకి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను చేర్చుకునే విధానం

1) ఉపాధ్యాయులు వారి వ్యక్తిగత లాగిన్ లో పైన చెప్పిన విధంగా DDO details మార్చుకున్న తర్వాత మీరు మీ DDO code తో లాగిన్ కండి.

2) Registrations tab లో Updated Employee Details Worklist లోకి వెళ్ళండి.

3) అక్కడ మీకు కొత్తగా మీ లాగిన్ లోకి వచ్చిన ఉపాధ్యాయుల పేర్లు కనపడతాయి. వారి హెల్త్ కార్డు ఐడీ పై క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి.

4) తిరిగి Registrations tab లో Enrollment Worklist Status లోకి వెళ్ళండి. అందులో మీకు రిజిస్టరై ఉన్న ఉపాధ్యాయుల పేర్లు సరిచూసుకోండి.

ప్రధానోపాధ్యాయులు /మండల విద్యాశాఖాధికారులు  లాగిన్ లో ట్రాన్ఫర్ ఐపోయిన ఉపాధ్యాయులను తొలగించుటకు

1) మీ DDO code తో లాగిన్ కండి

2) Registrations tab లో initiate transfer లోకి వెళ్ళండి

3) ట్రాన్ఫర్ చేయాల్సిన ఉపాధ్యాయుని ట్రెజరీ ఐడీ ఎంటర్ చేసి Retrieve details పై క్లిక్ చేయండి.

4) DDO అడ్రస్, జీతం, డిసిగ్నేషన్ తదితర వివరాలు మార్చి సబ్‌మిట్ చేయండి.

ఎవరికైనా లాగిన్ సమస్యలుంటే

1) http://www.ehs.ap.gov.in/EHSAP  లోకి లాగిన్ కాకమునుపే Any issue/complaint లోకి వెళ్ళండి. వివరాలతో పాటు మీ కంప్లైంటును మీ సంతకం మరియు DDO సంతకంతో కూడిన పత్రాన్ని జతపరచి సబ్‌మిట్ చేయండి.

2) రెండు మూడు రోజులలో వివరాలు సరిచేయబడతాయి. 

[email protected] కు మీ కంప్లైంటును మెయిల్ చేయండి

EHS HOSPITALS LIST IN AP, HYDERABAD, BANGULURU

error: Content is protected !!