⚡ఉపాధ్యాయులకు అందజేసే గుర్తింపు కార్డుల్లో వారి ఫొటో, పేరు, హోదాతోపాటు పాఠశాల పేరు, యూడైస్ కోడ్, చిరునామా తదితర వివరాలు నమోదు చేయనున్నారు.
⚡ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న తరహాలో ఇకపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ కార్డులను అందించనున్నారు.
⚡ తద్వారా నాడు- నేడు, ఇతర పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సులభంగా ఉంటుందని చెబుతున్నారు.
⚡ అంతే కాకుండా పాఠశాలల తనిఖీల సందర్భాల్లో గతంలో అనేక అవకత వకలను విద్యాశాఖ గుర్తించింది.
పలువురు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాకపోయినా హాజరైనట్లుగా నమోదు చేసి నట్లు తనిఖీల్లో వెల్లడయ్యాయి.
⚡ ఇకముందు ఇలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవని, అటెండెన్స్ ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
⚡ ఐడీ కార్డుల కోసం ఇప్పటికే సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రి సెల్వి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
⚡ ఒక్కో కార్డుకు రూ. 50 చొప్పున ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు లక్షా 1687 మందికి రూ. 50 లక్షల 84 వేల 350,
⚡ ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు 52 వేల 902మందికి రూ. 26 లక్షల 45 వేల వంద మొత్తాన్ని విడుదల చేశారు.
⚡ కార్డులు జారీ చేసిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వాటిని ధరించి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.