income-tax-slabs-details-in-central-budget-2020-february

income-tax-slabs-details-in-central-budget-2020-february

 Budget 2020* Slab rates Analysis

Old, new Income tax slabs| ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాత పన్ను విధానంతో పాటు కొత్త పన్ను విధానం (Old, new Income tax slabs)కూడా అందుబాటులోకి వచ్చింది.

అయితే ఈ రెండు విధానాల్లో ఏది బెటర్ అనే దానిపై వేతన జీవులు తెగ ఆలోచిస్తున్నారు.

ఇప్పటికే పాత టాక్స్ విధానంను ఎంచుకుంటే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో పాటు సెక్షన్ 80సీ కింద వివిధ పెట్టుబడుల్లో పెట్టే రూ.1.5 లక్షల పెట్టుబడులకు మినహాయింపు ఉంటుంది.

కొత్త విధానం ఎంచుకుంటే మాత్రం ఈ ప్రయోజనాలు ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే కొత్త పన్ను విధానం ఎంచుకుంటే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఎంతో ప్రయోజనకరమని తద్వారా మిగిలిన సేవింగ్స్ తో వేతన జీవులు స్వచ్ఛందంగా ఖర్చు చేసుకోవడమా లేక పొదుపు చేసుకోవడమా అనేది వారి ఇష్టమని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే కొత్త పాత రెండు విధానాల్లో ఏది మీకు సరిపోతుంది అనే విషయాన్ని ఉద్యోగస్తులు స్వయంగా తెలుసుకునేందుకు ఆర్థిక శాఖ తమ వెబ్ పోర్టల్ లో ప్రత్యేక కాలిక్యులేటర్ ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా పాత పద్ధతిలో పన్ను చెల్లిస్తే మంచిదా..

కొత్త విధానంలో పన్ను (Old, new Income tax slabs) చెల్లిస్తే పన్ను ఆదా అవుతుంది అనేది తెలసుకోవచ్చు.

కొత్త, పాత ఐటీ విధానాల్లో ఏది లాభదాయకమనే విషయం తెలుసుకునేందుకు www.incometax indiaefiling.gov.in విజిట్ చేసి ఈ-క్యాలిక్యులేటర్‌(e-calculator)ను వినియోగించుకోవచ్చు.

(e-calculator)ఇందులో వ్యక్తి తమ వయస్సుతో పాటు, వార్షిక స్థూల ఆదాయం, ఆదాయ వనరులు, అనుమతించిన మినహాయింపులు, తగ్గింపులు ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత పాత విధానంలో పన్ను ఎంత పడుతుంది?(e-calculator)  కొత్త విధానంలో పన్ను కట్టాల్సి ఉంటుందనేది తెలుసుకునే వీలుంది.

ఉదాహరణకు మీ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు అయినట్లయితే ఎంత టాక్స్ కట్టాల్సి ఉంటుందో చూద్దాం..

పాత టాక్స్ పద్ధతి డిడక్షన్స్ ప్రకారం, సెక్షన్ 80 సీ కింద రూ.1.50 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్స్ కింద 50 వేలు, ఎన్పీఎస్ కింద రూ.50 వేలు, సెక్షన్ 80 డి హెల్త్ ఇన్సురెన్స్ కింద రూ.50 వేలు అప్పుడు మీ పన్ను మినహాయింపు ఆదాయం దాదాపు రూ.3 లక్షలు దాకా పొందే అవకాశం ఉంది. అప్పుడు మీకు పన్ను విధించే ఆదాయం రూ. 5 లక్షలుగా ఉంటుంది. అప్పుడు పాతపన్ను విధానం ప్రకారం మీరు రూ.2.5 నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నట్లయితే 5 శాతం చొప్పున రూ. 12500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల లోపు మీ ఆదాయం ఉన్నట్లయితే సెక్షన్ 87A కింద టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

అదే కొత్త టాక్స్ సిస్టం ప్రకారం చూసినట్లయితే మీ సంపాదన ఏడాదికి రూ.8 లక్షలు అయితే, ఇందులో ఎలాంటి డిడక్షన్స్ ఉండవు.

మీరు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.8 లక్షలపై దాదాపు రూ.45 వేల వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇలాంటప్పుడు పాత పన్ను విధానమే బెటర్ అంటున్నారు నిపుణులు.

 ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది.

పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం. 

1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో 

6,50,000-1,50,000 =5,00,000

2.5లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0

కొత్త విధానం లో 

2.5లక్షల వరకు టాక్స్ 0

2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 6.5లక్షల వరకు టాక్స్ 

1,50,00 X10% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ 27,500

2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో 

7,00,000-1,50,000 =5,50,000

2.5లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 5.5లక్షల వరకు టాక్స్ 

50,00 X20% = 10,000

చెల్లించాల్సిన టాక్స్ 22,500

కొత్త విధానం లో 

2.5లక్షల వరకు టాక్స్ 0

2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 7.0లక్షల వరకు టాక్స్ 

2,00,00 X10% = 20,000

చెల్లించాల్సిన టాక్స్ 32,500

3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో 

8,50,000-1,50,000 =7,00,000

2.5లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 7.0లక్షల వరకు టాక్స్ 

2,00,00 X20% = 40,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500

కొత్త విధానం లో 

2.5లక్షల వరకు టాక్స్ 0

2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 

2,50,00 X10% = 25,000

7.5-8.5లక్షల వరకు టాక్స్ 

1,00,00 X15% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500

*పాత కొత్త టాక్స్ లో తేడా లేదు*

4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో 

9,00,000-1,50,000 =7,50,000

2.5లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 

2,50,00 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్ 62,500

కొత్త విధానం లో 

2.5లక్షల వరకు టాక్స్ 0

2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 

2,50,00 X10% = 25,000

7.5-9.0లక్షల వరకు టాక్స్ 

1,50,00 X15% = 22,500

చెల్లించాల్సిన టాక్స్ 60,000

5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో 

12,50,000-1,50,000 =11,00,000

2.5లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 10లక్షల వరకు టాక్స్ 

5,00,00 X20% = 1,00,000

10.0 – 11లక్షల వరకు టాక్స్ 

1,00,00 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ 1,42,500

కొత్త విధానం లో 

2.5లక్షల వరకు టాక్స్ 0

2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 

2,50,00 X10% = 25,000

7.5-10.0లక్షల వరకు టాక్స్ 

2,50,00 X15% = 37,500

10.0 – 12.5లక్షల వరకు టాక్స్ 

2,50,00 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్ 1,25,000

6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో 

16,00,000-1,50,000 =14,50,000

2.5లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 10లక్షల వరకు టాక్స్ 

5,00,00 X20% = 1,00,000

10.0 – 14.5లక్షల వరకు టాక్స్ 

4,50,00 X30% = 1,35,000

చెల్లించాల్సిన టాక్స్ 2,47,500

కొత్త విధానం లో 

2.5లక్షల వరకు టాక్స్ 0

2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500

5.0 – 7.5లక్షల వరకు టాక్స్ 

2,50,00 X10% = 25,000

7.5-10.0లక్షల వరకు టాక్స్ 

2,50,00 X15% = 37,500

10.0 – 12.5లక్షల వరకు టాక్స్ 

2,50,00 X20% = 50,000

12.5 – 15లక్షల వరకు టాక్స్ 

2,50,00 X25% = 62,500

15.0 – 16లక్షల వరకు టాక్స్ 

1,00,00 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ 2,17,500

పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.

ఈరోజు ప్రకటించిన 6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు

INCOME TAX 2 Types స్లాబ్స్ మతలబు!!*

కేంద్రం ప్రకటించిన బడ్జెట్ ఉద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ కాదు..తీవ్ర నిరాశ కల్గించింది. 

అందరూ తగ్గించిన స్లాబ్ Rates ను గమనించి ఆనంద పడ్డాం, కానీ లోతుగా చూస్తే 80C రిబెట్ లను తొలగించడం వల్ల చాలా నష్టపోతున్నారు..

గత సంవత్సర బడ్జెట్ కూడ మధ్యతరగతి ఉద్యోగుల పాలిట శాపం అని బాధ పడుతుంటే..

దీనికన్నా ఎక్కువగా మోసం చేసే ఈ బడ్జెట్ నందు మినహాయింపులు 80C క్రింద 1,50,000 తీసివేయడం అనేది ఉద్యోగులను మోసగించడం మాత్రమే. ఉద్యోగులు పొదుపు చేయవద్దు, బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కట్టవద్దు అన్నట్లు ఉంది.   

Example..

పాత పద్ధతిలో..

అన్ని మినహాయింపులు తీసివేసి Taxble Amount

5 లక్షల వరకు tax లేదు.5లక్షలు దాటితే 

2.5 నుండి 5లక్షలకు 5%Tax Rs12,500కట్టాలి 

Upto 2.5lakhs…….No Tax

2.5 to 5Lakhs………..5%

5 to10 Lakhs…………20%10 above 

*Net Taxable Incomeకు * *పాత పద్ధతి లో  Tax* 

1.Rs,6,00,000లకు-Tax

Rs12500+20000=32,500

2.Rs,7,00,000లకు Tax Rs12500+40000=52,500

3.Rs, 8,00,000లకు Tax Rs12500+60000=72,500

4.Rs,9,00,000లకు Tax Rs12500+80000=92,500

5.Rs,10,00,000లకుTax Rs12500+100000

=1,12,500

6.Rs,11,00,000లకు Tax Rs12500+100000+30000=1,42,500

7.Rs,12,00,000లకుTax Rs12500+100000+60000=1,72,500

8.Rs,13,00,000లకుTax Rs12500+100000+90000=2,02,500

*కొత్త పద్ధతిలో 80C రిబెటు (Rs1,50,000) వర్తించదు..* 

అంటే మొత్తం జీతంలో నుండి మినహాయించిన Rs, 1,50,000 కలిపి  Net Taxable Income గా చూపాలి..

కొత్త విధానం ప్రకారం

5 లక్షలు 6.5లక్షలు అవుతుంది. Tax 12,500+15,000=27,500

up to 2.5 to 5 L….5%

5 to7.5 L    ……..10%

7.5 to 10 L………15%

10 to12.5 L……..20%

12.5 to 15 L…… .25%.

 15 above………..30%

*Net Taxable Incomeకు*

 *కొత్త విధానం ప్రకారం* 

1.Rs,6,00,000 అంటే 7,50,000 లకు Tax

Rs12500+25000=37,500

2.Rs,7,00,000 అంటే  8,50,000 లకు Tax

Rs12500+25,000+15,000

=52,500

3.Rs,8,00,000అంటే  9,50,000 లకు Tax

Rs12500+25000+30000

=67,500 

4.Rs,9,00,000అంటే   10,50,000 లకుTax

Rs12500+25000+37500+10000 =85,000 

5.Rs,10,00,000 అంటే ,11,50,000లకు Tax

Rs12500+25000+37500+30000 =1,05,000 

6.Rs,11,00,000 అంటే  12,50,000 లకు Tax

Rs12500+25000+37500+50000 =1,25,000

7.Rs12,00,000 అంటే 13,50,000 లకు Tax Rs12500+25000+37500+50000 +25000 =1,50,000

8.Rs13,00,000 అంటే 14,50,000 లకుTax Rs12500+25000+37500+50000 +50000 =1,75,000

 *Tax తగ్గిందా.. పెరిగిందా..* 

Net Taxable Income 7లక్షల లోపల ఉంటే పాత పద్ధతి ద్వారా tax తగ్గుతుంది. 

7 లక్షలు దాటిన వారికి కొత్త పద్ధతి ద్వారా కొంత  tax తగ్గుతుంది. 

కేంద్ర ప్రభుత్వ అంకెల గారడీ ఇది.

FOR MORE DETAILS TAX @ GLANCE CLICK HERE PDF FILE DOWNLOAD

UPDATED LATEST INCOME TAX SOFTWARE 2019-20 NEW

error: Content is protected !!