new-number-plates-for-all-vehicles-central-government-guidelines-2020

new-number-plates-for-all-vehicles-central-government-guidelines-2020

వెహికల్ నంబర్ ప్లేట్ రంగులపై కేంద్రం క్లారిటీ.. మార్గదర్శకాలు జారీ

బ్యాటరీతో నడిచే వాహనాలకు ఆకుపచ్చ రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో పసుపు రంగు ఆల్ఫా న్యూమరల్స్ ఉన్న నంబర్ ప్లేటును అమర్చాలి.

తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం ఎరుపు రంగు న్యూమరల్స్ , పసుపు రంగు బ్యాగ్రౌండ్ నంబర్ ప్లేట్లను కేటాయించింది

డీలర్ల అధీనంలో ఉండే వాహనాల నంబర్ ప్లేట్లు ఎరుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో తెలుపు రంగులో నెంబరు ఉండాలని సూచించింది.

దానిపై తెలుపు రంగు అల్ఫా న్యూమరల్స్ ఉండాలని పేర్కొంది.

నంబర్ ప్లేట్ కేటాయింపు విధానంపై స్పష్టత కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఇందులో కొత్తగా ఎలాంటి మార్పులు లేవని వివరించింది.

*ఆంగ్లం అక్షరాలు మాత్రమే ఉండాలి .

అరబిక్ నంబర్లలోనే రాయాలి •*

*తాత్కాలికమైతే పసుపు పలకపై ఎరుపు రంగులో రాయాలి •*

*నంబర్ ప్లేట్ప రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే ఉండాలి*

• *ఏకరూప విధానం.. కేంద్రం మార్గదర్శకాలు*

️వాహనాల నంబర్ ప్లేట్ల విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

నంబర్ ప్లేట్ లేకుండా తిరగడం, నంబర్ల గజిబిజి నమూనాలు, పిచ్చిరాతలను ఇకపై ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. 

️తాత్కాలిక రిజిస్ట్రేషన్

పత్రాన్ని అతికించి వాహనం రోడెక్కినా నేరంగా పరిగణిస్తామని చెప్పింది.

దేశ వ్యాప్తంగా ఏకరూప విధానం అమలు కోసం విధివిధానాలు రూపొందించిం ది.

️11 వర్గాల వాహనాల నంబర్ ప్లేట్లలో రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటి రంగు గురించి

విస్తృత ప్రమాణాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ జారీచేసిన నోటిఫికేషన్లో తాత్కాలిక నంబర్ ప్లేట్, డీలర్ వద్ద ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లను కొత్తగా చేర్చింది.

ఇందుకోసం కేంద్ర మోటార్ వాహనా ల నిబంధనలు (సీఎంవీఆర్)లో మార్పులు చేసింది.

️వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి 1989 జూన్ లో నోటిఫై చేసిన సవరణకు స్పష్టత తీసుకొచ్చేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నోటిఫికేషన్జా రీ చేసినట్లు రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

️వాహనాల నంబర్ ప్లేట్ లను పెద్ద అక్షరాలతో ఆంగ్లం అక్షరాలు, అరబిక్ నంబర్లలోనే రాయాలి.

 ️తాత్కాలిక నమోదు సంఖ్యలు పసుపు పలకపై ఎరుపు రంగులో రాయాలి.

️నంబర్ ప్లేట్ పై రిజిస్ట్రేషన్ నంబర్ మాత్రమే ఉండాలి

️ప్రాంతీయ భాషలో రిజిస్ట్రేషన్ నంబర్లను చిన్న సైజులో రాయడాన్ని ఇకపై నేరంగా పరిగణిస్తారు.

️ఇవే నిబంధనలు వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్లకు కూడా వర్తిస్తాయి.

సాదా కాగితంపై కలిపి రాసిన సంఖ్యలు చెల్లుబాటు కావు.

️అంకెల పరిమాణం, రంగులు కూడా సీఎంవీఆర్ లో వివరంగా పొందుపరిచారు.

️టూ వీలర్, త్రీవీలర్ మినహా అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య 65 మి.మీ. ఎత్తు, 10 మి.మీ మందం, 10 మి.మీ. అంతరం తో ఉండాలి*

error: Content is protected !!