ONGC Scholarship: విద్యార్థులకు ఏటా రూ.48,000 స్కాలర్‌షిప్
ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC లిమిటెడ్ పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటించింది.
ఆ వివరాలు తెలుసుకోండి.
SC & ST పేద విద్యార్థులకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్-ONGC లిమిటెడ్ స్కాలర్‌షిప్స్ ప్రకటించింది.
ప్రతిభ ఉన్నా ఆర్థిక కారణాల వల్ల చదువుకు దూరం అవుతున్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రారంభించింది
ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ స్కీమ్‌లో 1000 మంది విద్యార్థులకు ఏటా రూ.48,000 స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. ఇంజనీరింగ్, మెడికల్ స్ట్రీమ్, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌లో మాస్టర్స్ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ పొందొచ్చు
కుటుంబ ఆదాయం వార్షికంగా రూ.4.50 లక్షల లోపు ఉన్న విద్యార్థులే ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేయాలి.
మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్స్‌కు ఎంపిక చేయనుంది ఓన్‌జీసీ
ఓఎన్‌జీసీ మొత్తం స్కాలర్‌షిప్స్ 1000 ఇవ్వనుంది.
494 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు,
90 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు,
146 మంది ఎంబీఏ విద్యార్థులకు,
270 మంది మాస్టర్స్ ఇన్ జియాలజీ, జియోఫిజిక్స్ స్టూడెంట్స్‌కి ఈ స్కాలర్‌షిప్స్ లభిస్తాయి
అమ్మాయిలకు 50% అంటే 500 స్కాలర్‌షిప్స్ కేటాయించింది ఓఎన్‌జీసీ
ఓఎన్‌జీసీ వార్షిక స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి 2019 అక్టోబర్ 15 చివరి తేదీ.
స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారి జాబితా వెల్లడించే తేదీ 2019 డిసెంబర్ 10.