Telugu Bhasha Varotsavalu 2023 From August 23rd to 29th Instructions

  Telugu Bhasha Varotsavalu 2023 From August 23rd to 29th Instructions

రిక సంఖ్య.నెం.30029/11/2023-ఎ&ఐ తేది:#ApprovedByDate#

విషయము: పాఠశాల విద్య శాఖ – రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులు పాటు ఆగస్టు 23 వ తేది నుండి ఆగస్టు 29 వ తేది వరకు శ్రీ గిడుగు రామూర్తి జయంతి వారోత్సవాలను నిర్వహణ విషయమై తగు ఉత్తర్వులు జారీ చేయటమైనది

సూచిక:

1. శ్రీయుత ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిని ఉద్దేశిస్తూ అధ్యక్షులు, అధికార భాషా సంఘం. అధికార భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి డి. ఓ. లేఖ సంఖ్య 45/అ.భా.స. (అ)/ 2023, తేదీ. 19,07,2023.

2. సర్కులర్ మేమో సంఖ్య, టిఇఎల్ ఎల్0 టిఎల్ డీఎ(ఎమ్ ఐ ఎస్ సి)/21/2023 తేది: 14.08.2023. (యువజనాభ్యుదయము, పర్యాటక మరియు భాషా సాంస్కృతిక (సిడిఒఎల్) శాఖ)

పై సూచికలను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఆంధ్ర ప్రదేశ్, అమరావతి కార్యాలయం (శాఖాధిపతుల కార్యాలయం) సిబ్బందికి, రాష్ట్రం లోని అందరి ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వారలకు మరియు జిల్లా విద్యాశాఖాధికారి వారలకు పంపుతూ తెలియచేయునది ఏమనగా శ్రీ గిడుగు రామూర్తి వారు తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యులు, ఉద్యమ పితామహులు, వారు తెలుగు భాషకు చేసిన ఘననీయమైన సేవలు చిరస్మరణీయం. కావున వారి సేవలను స్ఫూర్తిమంతం చేసే దిశగా శ్రీ గిడుగు రామూర్తి వారి జయంతి వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని అధికార భాషా సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ అధికారి భాషాభివృద్ధి ప్రాధికార సంస్థలు తీర్మానించాయి. కనుక శ్రీ గిడుగు రామూర్తి జయంతి వానోత్సవాలను, రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులు పాటు 23 వ తేదీ నుండి ఆగస్టు 29 వ తేదీ వరకు నిర్వహించాలని సూచిస్తూ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఆంధ్ర ప్రదేశ్, అమరావతి కార్యాలయం (శాఖాధిపతుల కార్యాలయం) లోను, రాష్ట్రం లోని అన్ని ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వారి కార్యాలయములలోను, జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములలోను, ఉప విధ్యాశాఖదికారి వారి కార్యాలయములలోను, మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయములలోను, ప్రభుత్వ పాఠశాలల లోను తెలుగు భాషపై ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్న మరియు పరిపాలనా వ్యవహారాలలో అధికార భాషగా తెలుగు వినియోగిస్తున్న అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసి వారిని సముచిత రీతిలో సత్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటమైనది.

అదేవిధంగా రాష్ట్ర లోని అందరి ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వారలకు మరియు జిల్లా విద్యాశాఖాధికారి వారలకు వారి వారి పరిధులలో గల రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక/మాధ్యమిక/ఉన్నత పాఠశాలల విద్యార్థిననీ/విద్యార్థులను, ఉపాధ్యాయులను తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమాలు, పోటీ కార్యక్రమాలు చేపట్టుటకు, వాటిలో (క్విజ్, కవితలు, సామెతలు కధలు కధానికలు, వ్యాసరచన మొదలైన) పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించుటకు చర్యలు తీసుకోనవలసినదిగా ఆదేశించడమైనది.

Download CSE Proceedings 

error: Content is protected !!