2017లో జీవో 55 ద్వారా డిపార్టుమెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానం ప్రవేశపెట్టారు.
ఆ ఏడాది నవంబరు నుంచి వచ్చిన విధానం ప్రకారం ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కు తగ్గించేలా మార్పులు చేశారు.
జవాబు రాయని ప్రశ్నలను పరిగణనలోకి తీసుకునే వారు కాదు.
అన్ని ఆబ్జెక్టివ్ పరీక్షల్లో కనీస మార్కలను 35శాతంగా తగ్గించారు.
ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, టీచర్ల యూనియన్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పబ్లిక్ సర్వీసు కమిషన్ కు దీనిపై ఎన్నో వినతులు సమర్పించారు.
ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు డిపార్టమెంటు పరీక్షలకు సంబంధం ఉన్న నేపథ్యంలో నెగిటివ్ మార్కులు ఉద్యోగులు, టీచర్లపై ఒత్తిడి పెంచుతున్నాయని వచ్చిన వినతుల మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాసి నెగిటివ్ మార్కులు జత చేస్తూ 1965 డిపార్టుమెంట్ పరీక్షలకు చేసిన 17వ సవరణనను తొలగించాలని కోరారు.
ఈ నెగిటివ్ మార్కుల వల్ల ఉద్యోగుల ఉత్తీర్ణతశాతం బాగా తగ్గిపోయిందని విశ్లేషణల్లో తేలిందని కూడా కమిషనర్ పేర్కొన్నారు.
పాస్ మార్కులు 35శాతానికి తగ్గించినా సరే, నెగిటివ్ మార్కుల వల్ల పాస్ అయ్యే వారి సంఖ్య బాగా తగ్గినట్లు గుర్తించారు.
ఇలాంటి నెగిటివ్ మార్కుల విధానం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో సైతం లేదని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నెగిటివ్ మార్కులు తొలగించింది.
కనీస పాస్ మార్కును గతంలో లా 40శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.