New-rule-for-withdrawing-money-at-SBI-ATMs-with-OTP

New-rule-for-withdrawing-money-at-SBI-ATMs-with-OTP

SBI ATM: అలర్ట్… ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు కొత్త రూల్*

*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్.

ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విషయంలో కీలక మార్పు తీసుకొచ్చింది బ్యాంకు.

ఇకపై ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి.*

 *దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి వచ్చింది.

అంటే ఎవరి కార్డు స్వైప్ చేస్తారో వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తేనే మెషీన్‌లో నుంచి డబ్బులు వస్తాయి.

ఓటీపీ లేకపోతే డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు.

రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్‌బీఐ.

ఇకపై మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో ఎప్పుడైనా సరే రూ.10,000 కన్నా ఎక్కువ నగదు తీసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే*

*ఈ ఏడాది జనవరిలోనే ఈ విధానం అమలులోకి వచ్చింది.

అయితే ఇప్పటి వరకు రాత్రి సమయంలో చేసే విత్‌డ్రాయల్స్‌కే ఓటీపీ విధానం వర్తించేది.

రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు డబ్బులు డ్రా చేసే కస్టమర్లు ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండేది.

మళ్లీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓటీపీ లేకుండానే డబ్బులు డ్రా చేసుకునేవారు కస్టమర్లు.

HOW TO CHECK SBI BALANCE & MINI STATEMENT PROCEESURE

SBI GOLD LOAN OFFERS & INTEREST RATES

కానీ ఇప్పుడు ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను 24 గంటలు అమలులోకి తీసుకొచ్చింది ఎస్‌బీఐ. 2020 సెప్టెంబర్ 15 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది.*

*మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ముందుగా ఏటీఎంలో మీ కార్డు స్వైప్ చేయాలి.

రూ.10,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.

మీరు సరైన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి.

రూ.10,000 లోపు డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం లేదు*

HOME LOAN INTEREST RATES FROM SEPTEMBER MONTH

error: Content is protected !!