తెలుగు వారికి గడిచిన 97 సంవత్సారాలుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఆర్థిక నేస్తం ఆంధ్రాబ్యాంక్ కాలగర్భంలో కలిసిపోనుంది
తొమ్మిది దశాబ్దాలకుపైగా సేవలు
యూనియన్ బ్యాంకులో విలీనం
ఆంధ్రా బ్యాంక్ కథ నేటితో కంచికి చేరుతోంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ప్రైవేటు బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు.
డిపాజిట్లు రూ.50 కోట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉండడంతో 1969లో జాతీయకరణను తప్పించుకుంది.
ఇందిరా గాంధీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 1980 ఏప్రిల్‌లో మాత్రం ఆంధ్రా బ్యాంక్ జాతీయకరణను తప్పించుకోలేకపోయింది.
బుధవారం (ఏప్రిల్ 1) నుంచి మరో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనమవుతూ తన ఉనికినే కోల్పోతోంది.
ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ యూబీఐలో విలీనమవుతోంది.
1980లో జాతీయం చేశారీ బ్యాంకును. అయితే.. దేశంలోనే తొలిసారి క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంక్ ఇదే.
1981లో క్రెడిట్ కార్డులను జారీ చేసింది. తద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను పరిచయం చేసింది.
ఇక, 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది.
2007లో బయోమెట్రిక్ ఏటీఎంలను ఇండియాకు పరిచయం చేసింది ఆంధ్రా బ్యాంక్.
అలా ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ బ్యాాంక్ ఇప్పుడు కనుమరుగు కాబోతోంది.
నేడే ఈ ప్రక్రియ మొదలుకాబోతోంది. ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్‌లో విలీనం అవుతోంది.
విలీనాల ద్వారా పీఎ్‌సబీల బలోపేతం పేరుతో తెలుగు ప్రజలతో ముడిపడి రెండు ప్రముఖ పీఎ్‌సబీలను కేంద్ర ప్రభుత్వం ఇతర పీఎ్‌సబీల్లో కలిపేస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో కలిసిపోయింది.
ఇప్పుడు తాజాగా ఆంధ్రా బ్యాంక్.. యూబీఐలో విలీనమవుతోంది.
ఉద్యోగుల వ్యతిరేకత
కాగా యూబీఐలో విలీనాన్ని ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
పీఎ్‌సబీల బలోపేతానికి విలీనాలు పరిష్కారం కాదని, దీనివల్ల ఉద్యోగుల ఉద్యోగ భద్రతకూ ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలీనం తర్వాత దాదాపు 700 శాఖలను హేతుబద్ధం చేయాల్సి ఉంటుందని యూబీఐ ఎండీ, సీఈఓ ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
కోవిడ్-19తో దేశం వణికిపోతున్నా, ప్రభుత్వం మొండి పట్టుదలతో ఆంధ్రా బ్యాంక్‌ను యూబీఐలో విలీనం చేయడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి.
ఇక ఏపీ ఎస్‌ఎల్‌బీసీ యూబీఐ
విలీనాలతో ఆయా రాష్ట్రాల స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్లు కూడా మారిపోయారు.
ఏప్రిల్ 1 నుంచి యూబీఐ ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎ్‌సబీసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తుంది.
ఆర్‌బీఐ ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకు ఆంధ్రా బ్యాంక్.. ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా వ్యవసహరించింది.