కేంద్రం ‘కరోనా ప్యాకేజీ’… వీరి అకౌంట్లో డబ్బులు పడతాయి..
కరోనా కల్లోలంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కేంద్రం ఆపన్న హస్తం అందించింది.
గరీబ్ కల్యాణ్ పేరుతో రూ. లక్షా 70 వేల కోట్లతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది.
పేదలు రోజువారీ కూలీల కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి అనురాగ్ ఠాగూర్‌తో కలిసి ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.
లాక్‌డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ.. పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు.
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
80 కోట్ల మంది పేద ప్రజలకు ఇప్పుడిస్తున్న రూ.5 కేజీల బియ్యం, గోధుమలకు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా అందిస్తామని నిర్మల పేర్కొన్నారు.
ఇప్పుడిస్తున్న 1 కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ధాన్యాలు ఇస్తామన్నారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద వచ్చే మూడు నెలల పాటు ఈ అదనపు ప్రయోజనాలు అందిస్తామన్నారు.
*90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు*
*🔸తమ పీఎఫ్ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం*
*🔸మోదీ సర్కార్ తాజాగా ఉద్యోగులకు తీపికబురు అందించింది. పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త తీసుకువచ్చింది. పీఎఫ్ కంట్రిబ్యూషన్‌తోపాటు విత్‌డ్రాయెల్స్ రూల్స్ కూడా సవరించింది.*
*🔹ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లు వారి పీఎఫ్ అకౌంట్ నుంచి ఇప్పుడు ఏకంగా 75 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే మూడు మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని అయినా వెనక్కి తీసుకోవచ్చు. మీ పీఎఫ్ ఖాతాలోని అకౌంట్‌లో ఉన్న మొత్తంపై ఇది ఆధారపడి ఉంటుంది.*
*🔸అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త కూడా అందించింది. వచ్చే మూడు నెలల కాలం పాటు పీఎఫ్ అకౌంట్ డబ్బులను కేంద్రమే భరించనుంది. అంటే ఉద్యోగి కంట్రిబ్యూషన్ మొత్తాన్ని, కంపెనీ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని అంటే మొత్తంగా 24 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే మీ పీఎఫ్ అకౌంట్‌లో జమచేయనుంది. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. 100 మంది వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుంది. అలాగే వీరిలో 90 శాతం మంది వేతనం రూ.15,000లోపు ఉండాలి.*
*🔹భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.31వేల కోట్లు కేటాయింపు*
*🔸రాష్ట్రాలకు కేటాయించిన మినరల్ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చు*