• నవంబర్ 1 నుంచి మొదటి సంవత్సరం*• *ఆలోగా ప్రవేశ పరీక్షల నిర్వహణ*
*ఇంజినీరింగ్ విద్యా సంవత్సరంపై నిర్ణయం*
*️ఉన్నత విద్యా సంవత్సరాన్ని నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలని ఆలిండియా
కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. అయితే నవంబర్ 1 నుంచి మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రారంభించాలని, సెప్టెంబర్ ఒకటి నుంచే మిగిలిన సెమిస్టర్లు ప్రారంభించాలని సూచించింది. కరోనా కారణంగా పాఠశాల విద్య,
ఉన్నత విద్యాసంవత్సరాల ప్రారంభంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విద్యా సంవత్సర ప్రారంభంపై తాజాగా
ఏఐసీటీఈ మార్గదర్శకాలు జారీ చేసింది.*
️నవంబర్ 15వ తేదీలోగా అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఇంజినీరింగ్
అడ్మిషన్లు పూర్తి చేయాలని సూచించింది.
అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గకపోవ డంతో గతంలో పలుమార్లు షెడ్యూళ్లు ప్రకటించినా.. వాటిలో మార్పుచేర్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరింత గడువు పొడిగిస్తూ ఏఐసీటీఈ మార్గదర్శకాలు విడుదల చేసింది.
️యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్పు (యూజీసీ) చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఇంజినీరింగ్ తరగతుల ప్రవేశాలు, సిలబస్ తరగతులు ఉండాలని స్పష్టం చేసింది.
*ప్రవేశ పరీక్షల గడువు పొడిగింపు..*
*️ఉన్నత విద్యా సంవత్సరంపై తాజాగా స్పష్టతనిస్తూ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఏఐసీటీఈ, యూజీసీ ప్రకటన చేయడంతో ప్రవేశ పరీక్షల విషయంలోనూ ఉన్నత విద్యామండలి సవరించిన షెడ్యూల్ విడుదల చేసింది.
ఇంజినీరింగ్ తో పాటు వివిధ కోర్సులకు సంబంధించిన ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, లాసెట్, ఈసెట్ తదితరాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది.
ఆగస్టు రెండో తేదీ నుంచి వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఇచ్చిన షెడ్యూల్‌ను మరింత పొడిగించి, సెప్టెంబర్ పదో తేదీ నుంచి అక్టోబర్ ఐదో తేదీవరకు వాటిని నిర్వహించాలని సూచనలు చేసింది.
మొదటి సంవత్సరం సెమిస్టర్ మినహామిగతా సెమిస్టర్లకు ప్రవేశ పరీక్షల అవసరం లేకపోవడంతో సెప్టెంబర్ ఒకటి నుంచి వాటి తరగతులు ప్రారంభం కానున్నాయి.
సెట్స్ పూర్తయిన తర్వాత అక్టోబర్ నెలాఖరులోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ ఒకటో తేదీ నుంచి మొదటి సంవత్సరం సెమిస్టర్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.
*సిలబస్ ఖరారు*
*️రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి ఇప్పటికే సిలబస్లో మార్పుచేర్పులు పూర్తయ్యాయి.
యూజీ కోర్సులైన డిగ్రీని మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు తీసుకొచ్చారు. నూతన విద్యా విధానం- 2020లోనూ కేంద్ర విద్యాశాఖ ఈ రకమైన సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టడంతో పాటు మొదటి ఏడాది నుంచే ఇంటర్న్ షిప్ విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థుల్లో ఉపాధిపరమైన అవకాశాలను మెరుగుపరిచేలా సిలబస్ కు రూపకల్పన చేశారు.
మరోవైపు కరోనా కారణంగా విద్యా సంవత్సరంలో పనిదినాలు తగ్గనున్న నేపథ్యంలో ఆలోగా సిలబస్ పూర్తయ్యేలా ప్రత్యేకంగా కొన్ని మార్పులు చేశారు.
గతంలో ఉన్న సిలబస్ లోని ఔట్ డేటెడ్ పాఠ్యాంశాల స్థానంలో వృత్తిపరమైన, ఉపాధికి అవసరమైన పాఠ్యాంశాలను చేరుస్తూ ఉన్నత విద్యామండలి సవరణలు తీసుకొచ్చింది