జిల్లాలో అప్‌గ్రేడ్ అయిన 32 ఉన్నత పాఠశాలలకు ఎట్టకేలకు ప్రధానోపాధ్యాయు (హెచ్‌ఎం) లను నియామకం చేయడానికి మార్గం సుగమమైంది.
ఇప్పటి వరకు వీటికి హెచ్‌ఎంలు లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.
కొత్తగా ఆ బడులకు హెచ్‌ఎం పోస్టులు కేటాయించడంతో ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం (ఫైనాన్షియల్ బర్డెన్) పడకుండా పాఠశాల విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంది.
ప్రస్తుతం జిల్లాలో 125 క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు 25 మంది పని చేస్తున్నారు.
మిగిలినవి ఖాళీగా ఉంటున్నాయి. ఇవన్నీ శాంక్షన్ పోస్టులే.
దీంతో ఈ పోస్టులను హెచ్‌ఎంలకు సర్దుబాటు చేయడం వల్ల ప్రభుత్వంపై భారం పడదని ఆలోచించి తాజాగా పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అన్ని జిల్లాల్లో ఉన్న క్రాప్ట్ టీచర్లు శాంక్షన్డు, వర్కింగ్ పోస్టుల వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖను ఆదేశించింది.
ఈ మేరకు జిల్లా విద్యాశాఖ స్పందించి ఏయే పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయో మండల విద్యాశాఖ నుంచి తాజాగా సమాచారం సేకరిస్తున్నారు.
ఇద్దరు క్రాఫ్ట్ ఉపాధ్యాయులు ఒక హెచ్‌ఎం పోస్టుకు సమానమని అధికారవర్గాలు అంటున్నాయి.
దీని ప్రకారం లెక్కిస్తే జిల్లాలో అప్‌గ్రేడ్ అయిన 32 ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల కోసం 64 క్రాఫ్ట్ టీచర్ల పోస్టులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు.
UPDATED NOVEMBER 8TH, 2020
PRIMARY, UP AND UPGRADED HIGH SCHOOLS — VACANCIES AND LONG STANDING TEACHERS NAMES ( BEFORE RATIONALISATION ) NOVMBER 8TH.
Check the lists and if any mistake, pl. mail the corrections to [email protected] through MEOs only.
ఈ మేరకు ప్రతిపాదనలు పంపనున్నారు. ఏడాది కిందటే ఈ పాఠశాలలు అప్‌గ్రేడ్ అయ్యాయి. కానీ అప్పటి నుంచి ఇంఛార్జిలను పెట్టి నడిపిస్తున్నారు.
త్వరలోనే రెగ్యులర్ హెచ్‌ఎంలు రావటం వల్ల సంబంధిత పాఠశాలల్లో పర్యవేక్షణ పెరిగి మంచి ఫలితాలు రావడానికి దోహదం చేస్తుందనే అభిప్రాయం ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి క్రాఫ్ట్ టీచర్ల పోస్టుల నుంచి అప్‌గ్రేడ్ పాఠశాలలకు హెచ్‌ఎంలను సర్దుబాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని కమిషనరేట్ కార్యాలయం కోరినట్లు విద్యాశాఖ వర్గాలు ధ్రువీకరించాయి.
త్వరలోనే ఈ నియామకాలు పూర్తవుతాయని తాము పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడమే తరువాయిగా చెబుతున్నారు. హెచ్‌ఎంలు వస్తే ఆ పాఠశాలల్లో పర్యవేక్షణ మెరుగుపడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.