ELECTRONICS CORPORATION OF INDIA LIMITED A Govt. of India (Dept. of Atomic Energy) Enterprise ECIL Post, Hyderabad – 500 062 Phone: 040-27182394, 27182222 Fax: 040-27120033 Email: [email protected] / [email protected]
ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు… నేరుగా ఇంటర్వ్యూ
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని నవంబర్ 23న ఉదయం 09:30 గంటల నుంచి 12:00 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
హైదరాబాద్‌లోని హెడ్ క్వార్టర్‌లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 10 ఖాళీలను ప్రకటించింది.
టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఆర్టిసన్ పోస్టులున్నాయి.
ఈ పోస్టుల కాలవ్యవధి ఏడాది మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువు పొడిగించే అవకాశముంది.
అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని నవంబర్ 23న ఉదయం 09:30 గంటల నుంచి 12:00 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు జిరాక్స్ తీసుకెళ్లాలి.
రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్‌లో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, రేడియో & టీవీలో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెడ్ ఉండాలి.
వయస్సు-
టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు 25 ఏళ్లు.
వేతనం-
టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు నెలకు రూ.23,000, జూనియర్ ఆర్టిసన్ పోస్టుకు నెలకు రూ.16,770.