Pradhan Mantri Suraksha Bima Yojana Scheme-PMSBY-insurance-scheme

Pradhan Mantri Suraksha Bima Yojana Scheme-PMSBY-insurance-scheme

PMSBY Scheme: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్‌కు ఏడాదికి రూ.12 మాత్రమే… వివరాలివే

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన-PMSBY. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ స్కీమ్.

కేవలం ఏడాదికి రూ.12 చెల్లిస్తే చాలు రూ.2 లక్షల ప్రమాద బీమా పొందొచ్చు.

ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన-PMSBY పేరుతో 2015లో ప్రారంభించిన సామాజిక సురక్ష పథకాన్ని ప్రారంభించింది.

ఈ స్కీమ్‌లో చేరేవాళ్లు ఏడాదికి కేవలం రూ.12 చెల్లిస్తే చాలు రూ.2 లక్షల బీమా ప్రమాద బీమా పొందొచ్చు.

నిరుపేదలు, తక్కువ ఆదాయం పొందే వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన బీమా పథకం ఇది.

ఇప్పటికే పలు బీమా పాలసీలు ఉన్నవారు కూడా ఈ పథకంలో చేరొచ్చు.

వారికి బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉండాలి. అన్ని బ్యాంకులూ PMSBY పథకాన్ని అందిస్తున్నాయి

ఇప్పటికే కోట్లాదిమంది ఈ పథకంలో చేరారు.

వారంతా ప్రతీ ఏటా మే 31 లోపు రూ.12 ప్రీమియం చెల్లించాలి.

అయితే సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ నుంచే రూ.12 ప్రీమియం ఆటోమెటిక్‌గా డెబిట్ అవుతుంది

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో అనేక లాభాలున్నాయి.

ఇది ప్రమాద బీమా పథకం.

ప్రమాదాల్లో మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా ఈ పథకం వర్తిస్తుంది.

ఈ పథకంలో చేరినవాళ్లు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు వస్తాయి.

AP HIGH COURT JOBS LAST DATE MAY 26TH CLICK HERE

HOW TO COMPLETE E-SR COMPLETE DETAILS CLICK HERE

FIND YOUR CFMS ID NUMBER CLICK HERE

శాశ్వత వైకల్యం పొందినట్టయితే రూ.2 లక్ష బీమా అందిస్తుంది ప్రభుత్వం.

పాక్షికంగా వైకల్యం పొందితే రూ.1 లక్ష జీవిత బీమా లభిస్తుంది.

గుండెపోటు, సహజ మరణాలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం వర్తించదు.

కేవలం ప్రమాదాల్లో మరణాలకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారెవరైనా చేరొచ్చు.

మీకు అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి సంప్రదిస్తే ఈ పథకంలో చేరుస్తారు.

లేదా మీరే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకంలో సులువుగా చేరొచ్చు.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వార్షిక ప్రీమియం రూ.12 మాత్రమే.

ప్రతీ ఏటా ఈ బీమా పథకం రెన్యువల్ అవుతుంది.

ఇప్పటికే మీరు ఈ పథకంలో చేరినట్టయితే బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం రూ.12 ఉండేలా చూసుకోవాలి

ప్రతీ ఏటా మే 25 నుంచి మే 31 మధ్య అకౌంట్ ‌లోంచి ప్రీమియం డబ్బులు ఆటో డెబిట్ అవుతాయి.

బీమా పథకం జూన్ 1 నుంచి మే 31 వరకు వర్తిస్తుంది

10th CLASS PUBLIC EXAMS JULY-2020 ALL SUBJECTS MODEL PAPERS

error: Content is protected !!