LIC-RECRUITMENT OF APPRENTICE DEVELOPMENT-OFFICERS-2019

LIC-RECRUITMENT OF APPRENTICE DEVELOPMENT-OFFICERS-2019

LIFE INSURANCE CORPORATION OF INDIA RECRUITMENT OF APPRENTICE DEVELOPMENT OFFICERS

TENTATIVE SCHEDULE OF EVENTS:
Candidates can log in for Registration of Applications on the dates given below:
Opening date of On-Line Registration of Application and On-line payment of Application Fees/Intimation Charges. – 20th May,2019
Last date of On-Line Registration of Application and On-line payment of Application Fees/Intimation Charges. – 9th June,2019
Download of Call letter for On-Line Examination 29th June, 2019 onwards Dates of Online Examination-Preliminary (tentative) 6th & 13th July,2019 Dates of Online Examination-Main (tentative) 10th August,2019

Qualifications :
(i) For Employees category and Agents category in both Urban and Rural area- Applicant shall possess the Bachelor’s Degree of a University in India established under a statute or approved for the purpose or the Fellowship of Insurance Institute of India, Mumbai.

మొత్తం ఖాళీలు 1251 

AP, TS లలో ఖాళీలు 

కడప 102,

హైదరాబాద్ 101,

కరీంనగర్ 35,

మచిలీపట్నం 97

నెల్లూరు 85

రాజమండ్రి 71

సికింద్రాబాద్ 91

విశాఖపట్నం 64

వరంగల్ 43

1251 ఏడీఓ పోస్టులకు ప్రకటన విడుదల

మార్కెటింగ్‌ పట్ల అభిరుచి, ఆసక్తి ఉన్న సాధారణ డిగ్రీ అభ్యర్థులను భారత జీవిత బీమా సంస్థ ఆహ్వానిస్తోంది. వీరు అభివృద్ధి అధికారులుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

భారత ప్రభుత్వ రంగానికి చెందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా, పెట్టుబడి సంస్థ. దేశవ్యాప్తంగా వేలాది శాఖలను, ఏజెంట్లను కలిగి ఉంది. జీవిత బీమా వ్యాపారంలో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది.

ఈ అత్యున్నత సంస్థ వ్యాపార విస్తరణలో అత్యంత కీలకమైన అప్రెంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల భర్తీకి హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు 1251.

సాధారణ డిగ్రీ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మంచి జీతంతోపాటు ఇతర ఎన్నో రకాల ప్రయోజనాలను అందించే ఈ ఉద్యోగానికి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. పరీక్షకు తక్కువ సమయం ఉంది కాబట్టి అభ్యర్థులు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రిపరేషన్‌ వేగంగా కొనసాగించాలి.

సాధారణ డిగ్రీ చాలు: 

ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మార్కెటింగ్‌లో పీజీ డిగ్రీ లేదా మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. మే1, 2019 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఎల్‌ఐసీలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

మూడు దశల్లో ఎంపిక
ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.

మొదటిది ప్రిలిమినరీ పరీక్ష. ఇది ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

రెండోది మెయిన్‌ పరీక్ష. దీన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షలో మార్కుల ఆధారంగా మౌఖిక పరీక్షకు పిలుస్తారు. అందులోనూ అర్హత సాధించినవారికి మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు: ప్రిలిమ్స్‌లో మూడు సెక్షన్లు వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అందులో రీజనింగ్‌ ఎబిలిటీకి 35 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 35 మార్కులు, ఇంగ్లిష్‌కి 30 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్‌ కేవలం క్వాలిఫైయింగ్‌ మాత్రమే. మిగతా 70 మార్కుల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌ పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది. ఇందులో 
1)
రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ
2)
జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
3)
ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌, మార్కెటింగ్‌ ఎబిలిటీల నుంచి ప్రతి విభాగానికి ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలు ఇస్తారు.

ప్రతి సెక్షన్‌లోనూ ఎల్‌ఐసీ నిర్ణయించే కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. మెయిన్స్‌ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి గరిష్ఠ మార్కులు 37.
ఉద్యోగంలో చేరినవారు తప్పని సరిగా నాలుగు సంవత్సరాలు ఎల్‌ఐసీలో పనిచేసే విధంగా బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది. మొదట ప్రొబేషనరీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లుగా నియమిస్తారు. ప్రారంభంలో నెలకు రూ.34,503 స్టైపెండ్‌ రూపంలో చెల్లిస్తారు. అప్రెంటిస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లుగా ఎంపికైన వారు సంస్థ తరఫున ఏజెంట్లను నియమించుకోవాలి. వారికి తగిన శిక్షణ, మెలకువలను అందించాలి. తద్వారా సంస్థ పాలసీలను ప్రజలకు విక్రయించాలి. ఈ సమయంలో వారు రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: 

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.50, ఇతర అభ్యర్థులు రూ.600 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
తెలుగు రాష్ట్రాల్లోని కేంద్రాలు: హైదరాబాద్‌, కడప, కరీంనగర్‌, మచిలీపట్నం, నెల్లూరు, రాజమండ్రి, సికింద్రాబాద్‌, విశాఖపట్నం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 09.06.2019

ఆన్‌లైన్‌ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జూన్‌ 29 నుంచి.

ప్రిలిమ్స్‌ పరీక్ష: జులై 6, 13

మెయిన్స్‌: ఆగస్టు 10
వెబ్‌సైట్‌:

 https://amaravathiteacher.com/jobs/lic-recruitment-of-apprentice-development-officers-2019/

ONLINE APPLICATION

At present the amount of stipend is about ₹.34,503/per month, except in case of candidates selected from LIC Employees category.

SELECTION PROCEDURE:
Selection will be made on the basis of on-line test followed by an Interview of candidates who qualify in the on-line test and subsequent pre-recruitment Medical examination.
(I) On-line Test for Open Market Category:
Selection of Apprentice Development Officer from Open Market Category will be done through two phase examination.
Phase-I: Preliminary Examination: Preliminary Examination consisting of objective test will be conducted online. The test will have three sections (with separate timings for each section) as follows:

1 Reasoning Ability 35 35

English & Hindi 20 minutes

2 Numerical Ability 35 35 English & Hindi 20 minutes

3 English 30 30** English 20 minutes

TOTAL 100 70 1 hour

Interview:
Marks obtained in the Main Examination only will be considered for shortlisting for interview and marks obtained in Main Examination + marks obtained in Interview will be considered for final merit listing of candidates.

FOR MORE DETAILS CLICK HERE FOR DOWNLOAD

EXAMINATION CENTERS LIST

LIC OFFICIAL WEBSITE CLICK HERE

ONLINE APPLICATION CLICK HERE