ssc-mts-2019-model-papers-previous-papers-study-material

ssc-mts-2019-model-papers-previous-papers-study-material

టెన్త్‌ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం
* ఎస్‌ఎస్‌సీ – మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ప్రకటన విడుదల

ఆఫీసు అంటే అన్ని రకాల సిబ్బంది ఉంటారు. ఎవరి పాత్ర మేరకు వాళ్లు ప్రధానమే. అర్హతలను బట్టి ఉద్యోగ స్థాయి మారుతుంది అంతే. కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేస్తోంది. దీని కోసం మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పేరుతో ఏటా నోటిఫికేషన్‌ వెలువరిస్తోంది. ఈ సంవత్సరానికి ప్రకటన విడుదలైంది. దాదాపు పదివేల వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా. విజయం సాధిస్తే చిన్న వయసులోనే మంచి ఉద్యోగంలో స్థిరపడొచ్చు. దేశవ్యాప్తంగా ఇరవై లక్షలమందికిపైగా పోటీ పడతారు. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది పరీక్షకు హాజరయ్యే అవకాశముంది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో రోజువారీ కార్యక్రమాలు సక్రమంగా సాగడానికి సాయపడే గ్రూప్‌-సీ ఉద్యోగులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఏటా భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్‌లలో అందించడం, ఫైల్స్‌ భద్రపరచడం, లేఖలు తదితర కమ్యూనికేషన్‌ను సంబంధితులకు చేరవేయడం, పోస్టల్‌ వర్క్‌.. ఇలా పలు రకాల విధులను నిర్వహిస్తూ పై అధికారులకు సాయపడుతుంటారు. అందుకే వీరిని మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ అని వ్యవహరిస్తారు.
విద్యార్హతలు: పదోతరగతి తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1 ఆగస్టు, 2019 నాటికి పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ పొందగలిగిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ. ఇరవై వేలకు పైగా జీతం అందుతుంది. వయసు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. రూ. 100 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 29, మే 2019
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు గడువు: 31, మే 2019
టైర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షతేదీలు: 02 ఆగస్టు, 2019 నుంచి 06 సెప్టెంబరు, 2019
టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష: 17 నవంబరు, 2019.

SSC MTS 2019 EXAMS NOTIFICATION, SYLLABUS, EXAM PATTERN

MOCK TEST -1

MOCK TEST -2

MOCK TEST -3

MOCK TEST -4

MOCK TEST -5

SSC MTS MODEL PAPER WITH KEY-1

SSC MTS MODEL PAPER WITH KEY-2

SSC MTS MODEL PAPER WITH KEY-3

SSC MTS MODEL PAPER WITH KEY-4

SSC MTS MODEL PAPER WITH KEY-5