275-apprentice-posts-naval-dockyard-apprentices-visakhapatnam

275-apprentice-posts-naval-dockyard-apprentices-visakhapatnam

విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో 275 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్‌లో డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతపర్చి విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌కు డిసెంబర్ 12 లోగా పంపాలి.

తగిన అర్హతలు ఉండి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 275 ఖాళీలను ప్రకటించింది.

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 5, ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 12 చివరి తేదీ.

ఆసక్తిగల అభ్యర్థులు www.apprenticeship.gov.in వెస్‌సైట్‌లో డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతపర్చి విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌కు డిసెంబర్ 12 లోగా పంపాలి.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Naval Dockyard Recruitment 2019:

ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 275

ఎలక్ట్రీషియన్- 29
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 32
ఫిట్టర్- 29

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 15మెషినిస్ట్- 19
పెయింటర్ (జనరల్)- 15
ఆర్ & ఏసీ మెకానిక్- 19
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 23
కార్పెంటర్- 23
ఫౌండ్రీమ్యాన్- 7
మెకానిక్ (డీజిల్)- 14
షీట్ మెటల్ వర్కర్- 29
పైప్ ఫిట్టర్- 21

Naval Dockyard Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే…

దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 5
రాతపరీక్ష- 2020 జనవరి 29
ఫలితాల విడుదల- 2020 జనవరి 31
ఇంటర్వ్యూ- ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 3, పెయింటర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 4, ఫిట్టర్, ఆర్ & ఏసీ మెకానిక్, మెకానిక్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 5, మెషినిస్ట్, ఫౌండ్రీమ్యాన్, పైప్ ఫిట్టర్ పోస్టులకు 2020 ఫిబ్రవరి 6.
శిక్షణ ప్రారంభం- 2020 ఏప్రిల్ 1
శిక్షణా కాలం- 1 ఏడాది.
విద్యార్హత- 10వ తరగతి 50% మార్కులతో పాస్ కావాలి. ఐటీఐ 65% మార్కులతో పాస్ కావాలి

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

ONLINE REGISTRATION LINK CLICK HERE