ap-grama-volunteer-phase-2-online-application-process-started-apply

ap-grama-volunteer-phase-2-online-application-process-started-apply

ఏపీలో 30,078 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి

ఏపీలో మరోసారి గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

హైలైట్స్

  • ప్రారంభమైన గ్రామ/ వార్డువాలంటీర్ రెండో విడత దరఖాస్తు ప్రక్రియ

  • మొత్తం 30,078 ఖాళీలు

  • పదోతరగతి అర్హత ఉంటే దరఖాస్తు30,078 చేసుకోవచ్చు

  • దరఖాస్తుకు చివరితేది నవంబరు 10

ఏపీలో 30 వేలకు పైగా గ్రామ/వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి రెండో విడత దరఖాస్తు ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే.

వీటిలో 10,908 గ్రామ వాలంటీర్ పోస్టులు ఉండగా.. 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు కలిపి మొత్తం 30,078 పోస్టులు ఉన్నాయి. నవంబరు 1 నాటికి 18 – 35 సంవత్సరాల మధ్య వయసుండి.. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ గ్రామ వాలంటీరు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.

19,170 WARD VOLUNTEERS JOBS

9,674 GRAMA VOLUNTEER JOBS NOTIFICATION

అభ్యర్థులు నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 15 నుంచి అభ్యర్థులకు దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు.

నవంబరు 16 నుంచి 20 వరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను నవంబరు 22న ప్రకటిస్తారు.

అనంతరం వీరికి నియామక పత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు అందుకున్నవారు డిసెంబరు 1 నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

గ్రామ సచివాలయాలతో కలిసి వీరు పనిచేయాల్సి ఉంటుంది

షెడ్యూలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 1 నుంచి

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబరు 10

➥ దరఖాస్తుల పరిశీలన: నవంబరు 15 నుంచి

➥ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు: నవంబరు 16 నుంచి 20 వరకు

➥ ఎంపికైన అభ్యర్థుల జాబితా: నవంబరు 22

➥ విధుల నిర్వహణ: డిసెంబరు 1 నుంచి

ONLINE REGISTRATION APPLICATION

ONLINE APPLICATION