ANM/MPHA(Female)-Recruitment-regular-basis-primary-health-centers-ap
1900 ఎఎన్ఎమ్ పోస్టులకు నోటిఫికేషన్
ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేసేందుకు రెగ్యులర్ ప్రాతిపదికన 1900 ఎఎన్ఎమ్ (మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ ఫిమేల్) పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
జిల్లాలవారీగా ప్రాథమికంగా ఖాళీల సంఖ్య శ్రీకాకుళంలో 52, విజయనగరం 29, విశాఖపట్నం 150, తూర్పు గోదావరి 227, పశ్చిమ గోదావరి 193, కృష్ణా 168, గుంటూరు 242, ప్రకాశం 99, నెల్లూరు 176, చిత్తూరు 182, కడప 97, అనంతపురం 140, కర్నూలు 145 పోస్టులున్నట్లు ప్రకటించింది.
పదోతరగతి అర్హత ఉండి, ఎఎన్ఎమ్ కోర్సు పూర్తిచేసిన 42 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.