37,750-vard-sachivalayam-jobs-municipalities-ap-guidelines

37,750-vard-sachivalayam-jobs-municipalities-ap-guidelines

3,775 వార్డు సచివాలయాలు 
* పట్టణ పరిపాలనలో కొత్త అధ్యాయం 
* ఏర్పాటుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం

పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం జులై 20న‌ అనుమతించింది.

వీటిల్లో 37,750 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఉన్న ఉద్యోగులు కాకుండా కొత్తగా 34,356 మందిని నియమిస్తారు.

ఒక్కో సచివాలయంలో పురపాలక, నగరపాలక సంస్థల నుంచి ఆరుగురు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి నలుగురు బాధ్యతలు నిర్వహించనున్నారు. గ్రామసచివాలయాల ఏర్పాటుకు జులై 19న‌ అనుమతించిన ప్రభుత్వం పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటుకు జులై 20న‌ ఉత్తర్వులు విడుదల చేసింది.

ప్రతి నాలుగు వేల జనాభాకో సచివాలయాన్ని విధిగా ఏర్పాటు చేయనున్నారు.

అవసరాన్ని బట్టి మూడు వేల నుంచి ఐదు వేలకో సచివాలయాన్ని ప్రారంభిస్తారు.

అయిదువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న డివిజన్లలో నాలుగు వేలకు ఒకటి చొప్పున జనాభా సంఖ్యను బట్టి రెండు, మూడు అదనంగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సూచించింది.

ప్రత్యేకించి డివిజన్లలో అత్యధిక జనాభా కలిగిన

విశాఖపట్నం,

విజయవాడ,

తిరుపతి,

కర్నూలు వంటి పెద్ద నగరాల్లో అదనంగా వస్తాయి.

నాలుగువేల కంటే తక్కువ జనాభా ఉన్నపుడు రెండు, మూడు డివిజన్లు కలిపి ఒక వార్డు సచివాలయం ఏర్పాటుచేస్తారు.

74వ రాజ్యాంగ సవరణతో దఖలు పడిన అధికారాలన్నీ సచివాలయాలకు బదలాయిస్తున్నారు.

పురపాలక, నగరపాలక సంస్థల కమిషనర్లు వేతన బిల్లులు చేసే (డీడీవో) అధికారిగా వ్యవహరించనున్నారు.

పురపాలికల్లో 21,756.. ఇతర శాఖల్లో 12,600 


వార్డు సచివాలయాల కోసం పురపాలక, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో 21,756, ఇతర ప్రభుత్వ శాఖల్లో మరో 12,600 ఉద్యోగుల నియామకానికి ఏర్పాట్లు చేయనున్నారు.

వాస్తవంగా పట్టణ స్థానిక సంస్థల నుంచి 22,650 మంది ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు.

నిర్దేశించిన హోదాకు సంబంధించి ఇప్పటికే 900 మంది అందుబాటులో ఉన్నందున మిగతా 21,756 మందిని కొత్తగా నియమిస్తారు.

వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి మరో 15,100 మంది ఉద్యోగుల సేవలు అవసరమని నిర్ధారించారు.

ఇప్పటికే 2,500 మంది అందుబాటులో ఉన్నందున కొత్తగా 12,600 ఉద్యోగులను నియమిస్తారు.

ఇందుకోసం సాధ్యమైనంత వేగంగా నియామక ప్రకటన జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) విధానంలో ఎంపికయ్యే ఉద్యోగులకు మొదటి రెండేళ్ల ప్రొబేషన్‌లో నెలకు రూ.15వేల చొప్పున చెల్లిస్తారు.

సర్వీసు నిబంధనల ప్రకారం తరువాత సంబంధిత ప్రభుత్వ శాఖలు వేతనాలను ఖరారు చేస్తాయి.

WARD ADMINISTRATION SECRETARY SYLLABUS & STUDY MATERIAL

91652 VILLAGE PANCHAYATHI SECRETARY POSTS NOTIFICATION DETAILS