ap-Gram-Panchayats-village-secretariat-guidelines-schedule

ap-Gram-Panchayats-village-secretariat-guidelines-schedule

Panchayat Raj and Rural Development Department – Gram Panchayats – Village Secretariat System in Gram Panchayats in the State

ఆంధ్రప్రదేశ్‌లో 1.30లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సమర్ధులు, ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

11,114 గ్రామ సచివాలయాలు…కొత్తగా 91,652 ఉద్యోగాలు: 

గ్రామ పంచాయతీలను ‘స్థానిక ప్రభుత్వాలు’గా తీర్చిదిద్దే దిశగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలకు బదలాయించబడిన 29 రకాల అధికారాలను సదరు పంచాయతీలే సమర్థవంతంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు.. ప్రస్తుతం పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న వారు కాకుండా కొత్తగా 91,652 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గ్రామ సచివాలయాల ఏర్పాటు, సచివాలయాల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. 

Tentative Time lines:
i. Issue of guidelines for establishment of Secretariats


ii. Issue of Notification for Village Secretariats.
 Determining the number of secretariats Finalizing designations and number of functionaries
 Finalizing Recruitment Criteria & Designation-wise Eligibility Criteria Legal Verification of Proposals – 19th July to 22st July 2019


iii. Recruitment of functionaries and issue of appointment letters –  23nd July to 15th Sept 2019

iv. Training of Functionaries –  16th to 28th Sept 2019


v. Setting up of Secretariat Office with Furniture,
Equipments, etc. – 20th Sept 2019


vi. Allotment of selected candidates to Village Secretariats – 30th Sept 2019


vii. Commencement of functioning of Village Secretariats – 2nd Oct 2019

నవరత్నాల పథకాలు అట్టడుగు స్థాయిలో అర్హులందరికీ సమర్థవంతంగా అందజేసే లక్ష్యంతో గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నూతనంగా వ్యవస్థలో గ్రామ పంచాయతీ కార్యాలయాలను గ్రామ సచివాలయాలుగా మారుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే గ్రామ వలంటీర్లు గ్రామ సచివాలయాల పరిధిలోకి వస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 

రాష్ట్రంలో గల 13,065 గ్రామ పంచాయతీలను 11,114 గ్రామ సచివాలయాలుగా వర్గీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. 2 వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండే గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు.

2 వేల లోపు జనాభా ఉన్నచోట వీలును బట్టి రెండు మూడు పంచాయతీలకు కలిపి ఒకే గ్రామ సచివాలయ యూనిట్ సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు.

4వేలకు పైబడి జనాభా ఉన్న ఒకే గ్రామ పంచాయతీలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వివరించారు.

గిరిజన ప్రాంతాల్లో 2వేల కంటే తక్కువ జనాభా ఉన్నచోట ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు.

గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితోపాటు ఆ గ్రామ సచివాలయం పరిధిలో పనిచేసే వలంటీర్లకు కన్వీనర్‌గా వ్యవహరించే గ్రామ కార్యదర్శి చేతుల మీదుగానే జీతాల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు.

కార్యదర్శి సహా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సెలవు మంజూరు చేసే అధికారాన్ని సర్పంచ్‌కు అప్పగించారు.

గ్రామ సచివాలయ సిబ్బంది వివిధ లైన్ డిపార్ట్‌మెంట్స్‌తో కలిపి గ్రామాభివృద్ధి ప్రణాళికలు (జీపీడీపీ) రచించి అమలు చేస్తారు. 

రెండేళ్ల పాటురూ.15 వేలు జీతం.. తర్వాత రెగ్యులరైజేషన్ : 


గ్రామ సచివాలయాల్లో పని చేయడానికి ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి రెండేళ్ల పాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా భావించి, ఆ కాలంలో నెలకు రూ.15 వేల చొప్పున స్టైఫండ్ రూపంలో వేతనంగా చెల్లిస్తారు.

రెండేళ్ల తర్వాత వివిధ శాఖల నిబంధనల మేరకు వారిని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి మండల, జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది.

ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షణకు ప్రత్యేక మాడ్యూల్‌ను తయారు చేయనున్నట్టు పేర్కొన్నారు.

గ్రామ సచివాలయాల్లో నియామకాల సంబంధించిన రాత పరీక్షను 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్, ఓఎంఆర్ విధానంలో జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇందులో 75 మార్కులకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉండేలా ఆలోచిస్తున్నారు.

నియామకాల్లో అభ్యర్థుల స్థానికతను పరిగణనలోకి తీసుకుంటారు.

అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య వయోపరిమితి విధించాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ పోస్టును బట్టి అది మారే అవకాశం ఉంది

గ్రామ సచివాలయల్లో.. ఉద్యోగ హోదా విద్యార్హతలు : 

నం.

ఉద్యోగి హోదా

ప్రతిపాదనలో ఉన్న కనీస విద్యార్హత

1.

పంచాయతీ కార్యదర్శి

ఏదైనా డిగ్రీ

2.

గ్రామ రెవెన్యూ అసిస్టెంట్

ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం

3.

సర్వే అసిస్టెంట్

4.

ఏఎన్‌ఎం

ఎస్‌ఎస్‌సీ లేదా తత్ససమానం, ఎంపీహెచ్ కోర్సు లేదా హెల్త్ వర్కర్ కోర్సు తప్పనిసరి

5.

వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్

రెండేళ్ల పాలిటెక్నికల్ డిప్లొమా లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు

6.

మహిళల సంరక్షణ అధికారి

ఏదైనా డిగ్రీ , కంప్యూటర్ పరిజ్ఞానం

7.

ఇంజనీరింగ్ అసిస్టెంట్

సివిల్ ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ డిప్లమా లేదా డిగ్రీ

8.

ఎలక్ట్రికల్ లైన్‌మెన్

ఐటీఐ ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషనల్ ఎలక్ట్రికల్

9.

అగ్రి, హార్టీకల్చర్ ఎంపీఈవోలు

బీఎస్సీ (అగ్రి) లేదా బీటెక్ (అగ్రి) లేదా రెండేళ్ల పాలిటెక్నికల్ డిప్లొమా

10.

డిజిటల్ అసిస్టెంట్

కంప్యూటర్ డిప్లొమా లేదా డిగ్రీ

11.

వెల్పేర్ అసిస్టెంట్

ఇంటర్మీడియెట్

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE DOWNLOAD