Skip to content
Grama-sachivalayam-job-chart-duties-vacancy-position
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న వార్డు/ గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* వార్డు, గ్రామ సచివాలయ పోస్టులు
మొత్తం ఖాళీలు: 1,28,589
1) గ్రామ సచివాలయ పోస్టులు: 95,088
పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ 5)-7040,
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్ 2)-710,
ఏఎన్ఎం (గ్రేడ్ 3)-9754,
యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్-9886,
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్-794,
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్-4000,
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)-6714,
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్-400,
మహిళా పోలీస్ అండ్ విమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్-11,158,
ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)-11,158,
పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్-11,158,
విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3)-11,158,
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్-11,158
2) వార్డు సచివాలయ పోస్టులు: 33,501
పరిపాలన కార్యదర్శి-3307,
సౌకర్యాల కల్పన కార్యదర్శి (గ్రేడ్ 2)-3601,
పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి (గ్రేడ్ 2)-3648,
విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి-3786,
ప్రణాళిక, క్రమబద్ధీకరణ కార్యదర్శి (గ్రేడ్ 2)-3770,
సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్ 2)-3786,
విద్యుత్ కార్యదర్శి (గ్రేడ్ 2)-1861,
ఏఎన్ఎం (వార్డు ఆరోగ్య కార్యదర్శి)-3786,
వీఆర్వో (వార్డు రెవెన్యూ కార్యదర్శి)-2170,
మహిళా, బలహీనవర్గాల పరిరక్షణ కార్యదర్శి-3786.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
చివరితేది: 10.08.2019
వార్డు కార్యదర్శుల విధులు :
-
వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి.
-
ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించాలి. ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
-
లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తరుచూ పరిశీలించాలి. కొందరు లబ్ధిదారులను సంప్రదించి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలి.
-
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
-
ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ అయ్యే విధంగా చూడాలి.
-
విద్య, ఆరోగ్యం, పారిశుధ్య పరిస్ధితులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. వార్డు వాలంటీర్లు వీటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.
error: Content is protected !!