ap-grama-sachivalayam-jobs-three-3-catagiries-written-exams

ap-grama-sachivalayam-jobs-three-3-catagiries-written-exams

ఏపి గ్రామ సచివాలయ పోస్టులకు 3 కేటగిరీలుగా రాతపరీక్షలు

గ్రామ సచివాలయ పోస్టుల నియామకాలను మూడు కేటగిరీలుగా విభజించారు.

ఒక్కో కేటగిరీ కింద పోస్టులకు ఒక్కో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

కేటగిరీ-1 కింద ఐదు రకాల పోస్టులకు కామన్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్‌-5),

మహిళా పోలీసు మరియు మహిళాశిశు అసిస్టెంట్‌(మహిళ),

వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ,

వార్డు ఉమెన్‌ అండ్‌ వీకర్‌ సెక్షన్స్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ(మహిళ) పోస్టులకు కామన్‌గా ఒకే పరీక్షను నిర్వహిస్తారు.*

ALL 20 POSTS , FEES DETAILS, VACANCY, SYLLABUS DETAILS

గ్రాడ్యుయేట్‌ అర్హతతో ఈ పరీక్ష రాసే మహిళలు ఐదు పోస్టులకు అర్హత కలిగి ఉండగా, పురుషులు అయితే మూడు రకాల పోస్టులకు అర్హత కలిగి ఉంటారు.

అదే విధంగా కేటగిరీ-2 కింద రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్‌-ఏ కింద ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2),

వార్డు అమెనిటీస్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2) పోస్టులకు కామన్‌ పరీక్ష ఉంటుంది.

ఈ కేటగిరీ కింద సివిల్‌ డిప్లమో/సివిల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు అర్హులు.

అదేవిధంగా గ్రూప్‌-బీ కింద విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌(గ్రేడ్‌-2),

విలేజ్‌ సర్వేయర్‌(గ్రేడ్‌-3) పోస్టులకు కూడా ఒకే పరీక్ష ఉంటుంది.

ఈ పోస్టులకు సివిల్‌ డ్రాప్టుమెన్‌ అర్హతగా పేర్కొన్నారు.*

కేటగిరీ-3 కింద 11 రకాల పోస్టులను కేటాయించారు.

ఈ పోస్టులకు విడివిడిగా రాతపరీక్షలు ఉంటాయి.

విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2),

విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌,

విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌,

పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్‌-6) డిజిటల్‌ అసిస్టెంట్‌,

వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2),

వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేటరీ సెక్రటరీ(గ్రేడ్‌-2), పశుసంవర్ధక అసిస్టెంట్‌,

ఏఎన్‌ఎం/వార్డు హెల్త్‌ సెక్రటరీ(గ్రేడ్‌-3) మహిళ,

వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ,

వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2),

విలేజ్‌ సెరీకల్చర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆయా టెక్నికల్‌ కోర్సులను బట్టి డిప్లమో,

బ్యాచిలర్‌ డిగ్రీలను అర్హతగా నిర్ణయించారు.*

ALL POSTS NOTIFICATIONS & OFFICIAL WEBSITES

ALL POSTS ELIGIBILITY, AGE, VACANCIES, FEES DETAILS

ALL POSTS JOB CHAT, DUTIES