Notification-Administrative-Assistant-jobs-in-indian-institute-of-science-Bangalore

Notification-Administrative-Assistant-jobs-in-indian-institute-of-science-Bangalore

ఐఐఎస్‌సీలో అవకాశం

విఖ్యాత విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), బెంగళూరు 85 అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.

ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు.

డిగ్రీ మార్కులు, ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.

ఇప్పటికే బ్యాంకు, రైల్వే పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నవారికి ఈ నియామక పరీక్ష సులువే!

అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులు గ్రూప్‌- సి కిందికి వస్తాయి.

ఎంపికైన వారు రెండేళ్లు ప్రొబేషన్‌లో ఉంటారు. అనంతరం వీరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు.

విధుల్లో చేరినవారికి కేంద్ర ప్రభుత్వ లెవెల్‌ 3 ప్రకారం రూ.21,700 మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు అదనంగా ఉంటాయి.

అంటే ఈ పోస్టులో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.33,000 వేతనం పొందవచ్చు. వీరు విశ్వవిద్యాలయానికి సంబంధించి రోజువారీ వ్యవహారాల్లో పాలుపంచుకుంటారు.

ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. వీటితోపాటు అకడమిక్‌ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలి.

ఎంపిక విధానం:

NOTIFICATION FOR ADMIN ASSISTANT JOBS

OFFICIAL WEBSITE INDIAN INSTITUTE OF SCIENCE

బ్యాచిలర్‌ డిగ్రీలో సాధించిన మార్కులు, ఆప్టిట్యూడ్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆప్టిట్యూడ్‌ పరీక్షకు 80 శాతం, అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఆప్టిట్యూడ్‌ పరీక్ష ఎలా?
పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుపుతారు. ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్‌ (10+2) స్థాయిలో ఉంటుంది.

పరీక్ష వ్యవధి 1.30 గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

ఇందులో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ నుంచి 16,

వెర్బల్‌ ఎబిలిటీలో 16,

లాజికల్‌ అండ్‌ న్యూమరికల్‌ రీజనింగ్‌ విభాగంలో 22,

జనరల్‌ అవేర్‌నెస్‌ 16,

కంప్యూటర్‌ అప్లికేషన్‌ పరిజ్ఞానానికి సంబంధించి 10 ప్రశ్నలు వస్తాయి.

ఆయా విభాగాలవారీ సిలబస్‌ (ప్రశ్నలడిగే అంశాల) వివరాలను ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు వాటిపై దృష్టి సారిస్తే సరిపోతుంది. ఇప్పటికే బ్యాంకు, రైల్వే పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నవారు ఈ పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు.

ఖాళీల వివరాలు: 

మొత్తం 85 పోస్టుల్లో విభాగాలవారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 37, ఓబీసీ 22, ఎస్సీ 13, ఎస్టీ 5, ఈడబ్ల్యుఎస్‌ 8 ఖాళీలు ఉన్నాయి.

దివ్యాంగులకు 4 పోస్టులు.

అర్హత: 

50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ అప్లికేషన్‌ పరిజ్ఞానం.

వయసు: నవంబరు 7, 2020 నాటికి 26 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు: దివ్యాంగులకు పదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు 

దరఖాస్తు ఫీజు:

 జనరల్, ఓబీసీలకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400
ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: నవంబరు 7, 2020

SANTHOOR WOMENS MERIT SCHOLARSHIPS APPLICATION & DETAILS

AP EAMCET-2020 COUNSILLING SCHEDULE & CUT OFF RANKS PDF FILE