Mega-Job-Mela-Nellore-multinational-compenies-athmakur-Nov-29th

Mega-Job-Mela-Nellore-multinational-compenies-athmakur-Nov-29th

నెల్లూరులో మెగా జాబ్ మేళా…తరలి రానున్న అంతర్జాతీయ కంపెనీలు

నవంబర్ 29వ తేదీ శుక్రవారం, ఉదయం 10 గంటలకు ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభం కానుంది.

నెల్లూరులో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖామాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

నవంబర్ 29వ తేదీ శుక్రవారం. 

ఉదయం 10 గంటలకు ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 2200 మందికి వివిధ కంపెనీలలో ప్లేస్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.

ఈ మెగా జాబ్ మేళాలో కియా మోటార్స్, అమర్ రాజాగ్రూప్స్, ఇసూజీ మోటార్స్, హీరో మోటో క్యాబ్ లిమిటెడ్, హిటోరో డ్రగ్స్, ఫ్లెక్స్ ట్రోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యురేకా ఫోబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ బి ఐ కార్డ్స్, అపోలో ఫార్మసీ, బజాజ్ క్యాపిటల్ ఫైనాన్స్ సహా పలు అంతర్జాతీయ, దేశీయ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నారు.