నిరుద్యోగులూ బీ రెడీ… ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4,805 ఖాళీల భర్తీ
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్… భారత రక్షణ శాఖకు చెందిన సంస్థ. దేశవ్యాప్తంగా 41 చోట్ల ఫ్యాక్టరీలున్నాయి.
వాటిలో ఏకంగా 4,805 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ సెంటర్.
నిరుద్యోగులకు మరో శుభవార్త.
రక్షణ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు-OFB భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ సెంటర్-OFRC మొత్తం 4,805 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది
ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
షార్ట్ నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా నాన్-ఐటీఐ, ఐటీఐ కేటగిరీలో 56వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ సెంటర్
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్యూప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో వీరిని నియమించనుంది.
మొత్తం మొత్తం 4805 అప్రెంటీస్ ఖాళీలను ప్రకటించింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. అందులో నాన్-ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 1595, ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 3210
నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులకు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 50% మార్కులతో పాస్ కావాలి. మ్యాథ్స్, సైన్స్‌లో 40% మార్కులు ఉండాలి. ఐటీఐ కేటగిరీ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి
ఈ పోస్టులకు దఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి
ఈ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు-OFB అధికారిక వెబ్‌సైట్ http://www.ofb.gov.in ఓపెన్ చేసి ‘News & Announcements’ సెక్షన్‌లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది
దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ఫాలో అవుతుండాలి