SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించింది. నోటిఫికేషన్ వివరాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మొత్తం 1157 ఉద్యోగాలను ప్రకటించింది.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టులు ఇవి.
లైబ్రరీ క్లర్క్, ఆఫీస్ అటెండెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబరేటరీ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి.
ఫేజ్ 8 సెలక్షన్ టెస్ట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. సాధారణంగా ఉన్నత ఉద్యోగాల భర్తీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC చేపడుతూ ఉంటుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మాత్రం సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ లాంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
అందులో భాగంగా ప్రస్తుతం 1157 ఖాళీలను ప్రకటించింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 10+2, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 20 చివరి తేదీ.
ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వేర్వేరుగా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
SSC Phase-VIII Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే…