9674-grama-ward-volunteer-ecruitment-notification-details
9,674 గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు ఎప్పుడంటే?
Grama/Ward Volunteers Notification | గతంలో నియామకాలు చేపట్టగా మిగిలిన గ్రామవాలంటీర్ పోస్టుల ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది.. వివరాలు ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా 9,674 పోస్టుల భర్తీ
నవంబరు 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
డిసెంబరు 1 నుంచి విధుల నిర్వహణ
ఏపీలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు వినిపించింది.
గతంలో నియామకాలు చేట్టిన గ్రామవాలంటీర్ పోస్టులకు సంబంధించి..
పలు కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఇందుకు సంబంధించి నవంబరు 1న ఆయా జిల్లాల వారీగా ప్రకటనలు జారీ చేయనున్నారు.
గ్రామ వాలంటీర్ పోస్టులకు నవంబరు 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
అభ్యర్థులు నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నవంబరు 15 నుంచి అభ్యర్థులకు దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు.
నవంబరు 16 నుంచి 20 వరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.
షెడ్యూలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం |
నవంబరు 1 నుంచి |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ |
నవంబరు 10 |
దరఖాస్తుల పరిశీలన |
నవంబరు 15 నుంచి |
అభ్యర్థులకు ఇంటర్వ్యూలు |
నవంబరు 16 నుంచి 20 వరకు |
విధుల నిర్వహణ |
డిసెంబరు 1 నుంచి |
ఎవరు అర్హులు..?
నవంబరు 1 నాటికి 18 – 35 సంవత్సరాల మధ్య వయసుండి..
పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ గ్రామ వాలంటీరు పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.
ఏపీలో 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
అయితే వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరడంతో.. 9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి.
చివరకు ఖాళీల సంఖ్యను 9674గా అధికారులు నిర్ణయించారు.
తొలుత ప్రకటించిన ఖాళీల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి…
జిల్లా |
ఖాళీలు |
శ్రీకాకుళం |
200 |
విజయనగరం |
823 |
విశాఖపట్నం |
370 |
పశ్చిమ గోదావరి |
590 |
తూర్పు గోదావరి |
1,861 |
కృష్ణా |
453 |
గుంటూరు |
919 |
ప్రకాశం |
592 |
నెల్లూరు |
340 |
చిత్తూరు |
678 |
కడప |
891 |
అనంతపురం |
955 |
కర్నూలు |
976 |
మొత్తం |
9,648 |