అనంతపురం జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది.
ఏపీలోని అనంతపురం జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా అంగన్వాడీ వర్కర్ (టీచర్), అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
10వ తరగతి అర్హత ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివాహితులై ఉండాలి.
సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 28 నుంచి DECEMBER 08 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు . .
* అంగన్వాడీ ఉద్యోగాలు
పోస్టు ఖాళీలు
అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) – 55
మినీ అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) – 18,
అంగన్వాడీ సహాయకులు (హెల్పర్) – 256,
మొత్తం ఖాళీలు – 329
అర్హతలు . . . ➦ పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ➦ వివాహితులైన స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే అంగన్వాడీ ఉన్న గ్రామంలో స్థానికులై ఉండాలి.
వయోపరిమితి:
01.07.2019 నాటికి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 18 సంవత్సరాలు నిండినవారు కూడా అర్హులు.