LIC-Assistants-Recuitment-2019-jobs-Halltickets-syllabus-exam-pattern

LIC-Assistants-Recuitment-2019-jobs-Halltickets-syllabus-exam-pattern

Important Dates

Commencement of Call letter Download

16 – 10 – 2019

Closure of Call letter Download

31 – 10 – 2019

వెబ్‌సైట్‌లో ‘LIC’ అసిస్టెంట్ పరీక్ష హాల్‌టికెట్లు

Life Insurance Corporation of India Recruitment అసిస్టెంట్ కేడర్‌ పరిధిలోని క్లరికల్, క్యాషియర్, సింగిల్ విండో ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను ఎల్‌ఐసీ ఇండియా భర్తీ చేయనుంది.

ఎల్‌ఐసీలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్టోబరు 16న విడుదల చేసింది.

అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది.

అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 30, 31 తేదీల్లో ఎల్‌‌ఐసీ అసిస్టెంట్ ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.

అక్టోబరు 31 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 21, 22 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబరు 30, 31 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని డివిజన్లలో ఆయా తేదీల్లో జరిగే పరీక్షకు ఈ కొత్త షెడ్యూలు వర్తించనుంది.

ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్ కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా వివిధ డివిజన్ల పరిధిలో 8 వేలకుపైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్‌ఐసీ ఇండియా నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే.

సౌత్ రీజియన్‌లో మొత్తం 631 పోస్టులు ఉండగా.. తెలుగు రాష్ట్రాలకు 276 పోస్టులు కేటాయించారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.

ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారినే.. మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు

ప్రిలిమినరీ పరీక్ష విధానం..

మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.

మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.

ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఇస్తారు.

ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
➥ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.

వీటిలో ఇంగ్లిష్/హిందీ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు- 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు – 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు – 35 మార్కులు ఉంటాయి.
➥ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున మొత్తం 60 నిమిషాల సమయం ఉంటుంది.
➥ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
➥ అభ్యర్థులు ఒక్కో విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
➥ వీటిలో ఇంగ్లిష్/హిందీ లాంగ్వేజ్ విభాగంలో కనీస అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 11 మార్కులుగా, ఇతరులకు 12 మార్కులుగా నిర్ణయించారు.
➥ ఇక న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల్లో కనీస అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 13 మార్కులుగా, ఇతరులకు 14 మార్కులుగా నిర్ణయించారు.

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు- 276

రీజియన్

పోస్టులు

హైదరాబాద్

40

కడప

40

కరీంనగర్

68

మచిలీపట్నం

24

నెల్లూరు

36

రాజమండ్రి

11

విశాఖపట్నం

46

వరంగల్

11

TOTAL POSTS 276.

LIC ASSISTANT JOBS SYLLABUS CLICK HERE FOR DOWNLOAD

LIC ASSISTANT JOBS HALLTICKETS DOWNLOAD HERE